English | Telugu
Brahmamudi : ఆ బిడ్డని వదిలేసి రా.. లేదంటే ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకో!
Updated : Mar 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -371 లో... అసలు మనం మంచి ఛాన్స్ ని ఉపయోగించుకోవడం లేదని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఏంటదని రాహుల్ అడుగగా.. రాజ్ ఇంత పెద్ద తప్పు చేసాడు. ఈ విషయాన్ని మనం అందరికి తెలిసేలా ఎందుకు చేయడం లేదు.. పేపర్ మీడియా వాళ్ళకి చెప్తే ఈ కుటుంబం పరువు పోయి రాజ్ ని ఎండీ పదవి నుండి తీసేస్తారు. ఆ కళ్యాణ్ గానికి కవితలు తప్ప క్లయింట్ ని డీల్ చెయ్యడం రాదు. కాబట్టి నువ్వే ఎండీవి కావచ్చని రాహుల్ తో రుద్రాణి చెప్పగానే రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత వాళ్ళ మాటలన్నీ విన్న స్వప్న.. వాళ్ళ దగ్గరికి వచ్చి మా కావ్యని ఇబ్బంది పెట్టే పనులు ఏవైనా చేస్తే మీ బాగోతం బయట పెడుతానంటూ రుద్రాణి, రాహుల్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు రాజ్, కావ్య ఇద్దరు ఆఫీస్ కి వస్తారు. రాజ్ చేతిలో బాబుని చూసి.. ఆఫీస్ లో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఎవరు ఆ బాబు అని శృతి అడుగుతుంది. నువ్వు ముందు వర్క్ చేసుకోమంటూ రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత బాబుని రాజ్ తన చైర్ పక్కన పడుకోపెట్టి ఆడిస్తాడు. అప్పుడే కావ్య, శృతి డిజైన్స్ తీసుకొని వస్తారు. అదే సమయంలో మేనేజర్ కూడా వస్తాడు. ఎవరు ఆ బాబు అని అడుగుతాడు. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. మనకు ఎందుకని శ్వేత అతన్ని బయటకు తీసుకొని వెళ్తుంది. కాసేపటికి శ్వేత, మేనేజర్ బయటకు వచ్చి.. రాజ్ గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటే కావ్య వచ్చి వాళ్లకు క్లాస్ పీకుతుంది. మరొకవైపు అప్పు ఇంటికి వచ్చి ఎవరి మీదనో ఉన్న కోపాన్ని కనకం, కృష్ణమూర్తిలపై చూపిస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి శ్వేత వచ్చి.. "ఆ బాబు నీ కొడుకేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావ్? కావ్య అంటే ఇష్టం ఉంది.. అది చెప్పడానికి ఇగో అడ్డువస్తుందని అనుకున్నాను కానీ ఆల్రెడీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారా.. కావ్యని ఎందుకు మోసం చేసావ్" అంటు రాజ్ పై అరుస్తుంది. అయినా రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు.
ఆ తర్వాత శ్వేత కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలన్నీ విన్న కావ్య.. అయితే తన ఫ్రెండ్ కు కూడా ఈ విషయం గురించి తెలియదా? అసలు ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఆ బిడ్డని ఎందుకు తీసుకొని వచ్చారని కావ్య అనుకుంటుంది. ఇక బాబుకి కావ్య బొమ్మలు తీసుకొని వస్తుంటే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎదరుపడతారు. తన సిచువేషన్ చూసి బాధపడతారు. తరువాయి భాగంలో.. బిడ్డని వదిలేసి రా లేదంటే ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకోమని రాజ్ కి అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.