English | Telugu

గోల్డెన్ బాల్ పవర్ తో కొత్త ట్విస్ట్.. ఈ టాస్క్ లో గెలిచిందెవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ తమ స్ట్రాటజీలతో ఆకట్టుకుంటున్నారు. తొమ్మిదవ వారం కంటెస్టెంట్స్ టాస్క్ లతో బిజీ అయిపోయారు.

'హాల్ ఆఫ్ ది బాల్' టాస్క్ లో వీర సింహాలు, గర్జించే పులలు పోటీ పడుతుండగా.. ఇందులో బిగ్ బాస్ ఒక గోల్డెన్ బాల్, ఒక బ్లాక్ బాల్ ఇచ్చాడు. ఇవి రెండు ఎవరికి వస్తాయో వారికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. పైపు నుంచి చిన్న చిన్న బాల్స్ రావడం.. రెండు టీమ్ లలోని వారు వాటిని పట్టుకొని వారి వారి సంచుల్లో దాచుకోవడం, వీలైనన్ని ఎక్కువ బాల్స్ ని దాచుకున్నవారే కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే నిన్నటి టాస్క్ లో గోల్డెన్ బాల్ గౌతమ్ కృష్ణ టీమ్ కి వస్తుంది. దాంతో వాళ్ళలోని భోలే షావలిని అవతలి టీమ్ లోని అంబటి అర్జున్ తో స్వాప్ చేసుకునే అవకాశాన్ని పొందారు. ఇక ఇప్పుడు గౌతమ్ కృష్, అంబటి అర్జున్, యావర్, టేస్టీ తేజ, రతిక, శోభాశెట్టి, అశ్విని వీళ్ల టీమ్ లో ఉన్నారు.

మరొక గేమ్ లో అంబటి అర్జున్, అమర్ దీప్ ఒకవైపు, శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ మరొకవైపు ఉండి గేమ్ ఆడగా ఇందులో అమర్ దీప్, అంబటి అర్జున్ లు గెలుస్తారు. ఆ తర్వాత పోస్ట్ ద్వారా గెలిచిన వీరికి ఒక లెటర్ వస్తుంది. ఇందులో గెలిచిన వీర సింహాల టీమ్ కి 500 బాల్స్ వచ్చాయి. ఆ తర్వాత టాస్క్ ముగిసింది. మీ దగ్గర ఉన్న బాల్స్ ని జాగ్రత్తగా చూసుకోండని బిగ్ బాస్ రెండు టీమ్ లకి చెప్పాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..