English | Telugu
గీతు దెబ్బ..ఆదిరెడ్డి అబ్బా!
Updated : Nov 5, 2022
బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ లు, గేమ్ లు, వార్ లు, ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతోన్నాయి. మొన్నటి వరకు సప్పగా సాగిన బిగ్ బాస్కంటెస్టెంట్స్ మధ్యలో గొడవల వల్ల కలిసి ఉన్నవాళ్ళు విడిపోవడం జరుగుతూ ఉంటే మరింతగా హైప్ ని పెంచేస్తోంది. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డికి గీతు మధ్య జరిగిన వాగ్వాదంచూసే ప్రేక్షకులకు ఇంటెన్స్ గా అనిపిస్తూ సాగింది.
గేమ్ తర్వాత గీతు, ఆదిరెడ్డికి సారీ చెప్పింది. "నా మైక్ విసిరేసి, నేను గేమ్ లో నుండి అవుట్ అయ్యాను. ఇది కేవలం నీ వల్ల. నేను అక్కడ గేమ్ లో భౌతికంగా చనిపోయాను" అని ఆదిరెడ్డి, గీతుతో కోపంగా అన్నాడు. ఆ తర్వాత గీతు మాట్లాడింది. "నా టీం సభ్యులు అందరు నా మాట విన్నారు. అందులో ముఖ్యంగా రేవంత్ నా మాట విన్నాడు. లీడర్ చెప్పింది విన్నారు మా వాళ్ళు. మేము అన్ ఫేయిర్ గా ఉంటాం అని చెప్పి అన్ ఫేయర్ గా ఉన్నాం. మీరు ఫేయిర్ గా ఉంటాం అని చెప్పి ఉండలేకపోయారు. మేము బుద్ధి బలం చూపాం. కానీ మీరు చూపించలేకపోయారు" అని ఆదిరెడ్డితో గీతు చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత, "ఇక ముందు చూడు ఆదిరెడ్డి. గీతు ఆట ఏంటో చూపిస్తా. నా దెబ్బ ఏంటో చూపిస్తా. ఆ తర్వాత 'గీతు దెబ్బ..ఆదిరెడ్డి అబ్బా' అని అందరు అనుకుంటారు." అని గీతు, ఆదిరెడ్డికి సవాల్ విసిరింది. దానికి రిప్లైగా "సరే చూస్కుందాం" అని ఆదిరెడ్డి అన్నాడు. 'Everything is Fair In Game' అని గీతు, ఆదిరెడ్డితో చెప్పింది. "వీక్ నెస్ ని గేమ్ లో ఆడాలి. అంతే కానీ మనం బయట పర్సనల్ గా మాట్లాడుకున్నది. ఇలా గేమ్ లో చూపుతావా? ఎప్పుడు ఇలానే చేస్తావా? ఏదోకటి చెప్తావ్ " అని అరుస్తూ తన మైక్ ని, టీషర్ట్ ని విసిరేస్తూ, కిందకి కొట్టాడు. ఇది చూసి హౌస్ మేట్స్ అందరు ఆశ్చర్యపోయారు.