English | Telugu

జబర్దస్త్ కొత్త యాంకర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్ సౌమ్యశారద నడిగి అలియాస్ సౌమ్య రావు ఎవరో మీకు తెలుసా ? సౌమ్యరావు కర్ణాటక అమ్మాయి. 1992 సెప్టెంబర్ 29న కర్ణాటకలోని శివమొగ్గలో పుట్టింది. మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కర్ణాటకలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసాక బెంగళూరులోని కువెంపు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత కన్నడ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి నుంచి తనకు యాక్టింగ్ మీద ఉన్న ఇంటరెస్ట్ తో అటువైపు అడుగులు వేసింది. అలా కన్నడ, తమిళ్ సీరియల్స్ లో నటించింది. సన్ టీవీలో వచ్చిన "వల్లి" అనే సీరియల్ లో "ఉమా మహేశ్వరి" పాత్ర ద్వారా ఆమె అరంగేట్రం చేసింది. జీ కన్నడ టెలివిజన్ లో ప్రసారమైన ‘పత్తేదారి ప్రతిభ’ సీరియల్లో అదితి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం సన్ టీవీలో "రోజా" లో సాక్షి అనే పాత్రలో ఇంకా " నెంజమ్ మరప్పతిల్లై"లో సత్య అనే నెగిటివ్ రోల్ పోషించింది.

ఈటీవీలో "శ్రీమంతుడు" సీరియల్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సత్య క్యారెక్టర్ లో తన విలనిజాన్ని చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. మరో పక్క ఇదే పేరుతో సత్య అనే క్యారెక్టర్ లో "మనసు మాట వినదు" సీరియల్ లో నటించింది. ఇక ఈ సీరియల్స్ లో ఆమె నటన చూసి ఇప్పుడు యాంకర్ గా ఈమెకు అవకాశం ఇచ్చింది మల్లెమాల యాజమాన్యం. ఇప్పటివరకూ విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను భయపెట్టిన సౌమ్యరావు ఒక రష్మీ లాగ, ఒక అనసూయలాగ ఎంటర్టైన్ చేస్తుందా.. లేదా అనేది చూడాలి.