English | Telugu
మాట మార్చిన గీతు.. ఫేట్ ఏమవుతుందో..!
Updated : Oct 27, 2022
టాస్క్ లతో జనాలని ఇంట్రెస్ట్ గా చూసేలా చేస్తున్న బిగ్ బాస్. చేపల టాస్క్ లో కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు. ఒక టాస్క్ ఇచ్చి అందులో మేజర్ ట్విస్ట్ లతో హౌస్ లోని కంటెస్టెంట్స్ కి, చూసే ప్రేక్షకులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరు ఇద్దరుగా జోడి చేసి వారికి చేపలు కాపాడుకునే బాధ్యతలు ఇచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ వారి చేపలని కాపాడుకోవడానికి తెగ కష్టపడ్డారు. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపారు రేవంత్, గీతు, సూర్య, ఇనయ.
గీతు అందరి దగ్గరికి వెళ్ళి చేపలు కొట్టేసే పనిలో ఉంది. అయితే గీతు బాధ భరించలేక రేవంత్ వాష్ రూంకి వెళ్ళి పడుకున్నాడు. సూర్య,గీతు కలిసి రేవంత్ ని డోర్ కొట్టి లేపారు. "ఏంటి వాష్ రూంలో పడుకున్నావ్. ఎవరైనా వాష్ రూం కి వస్తే ఎలా ?" అని గీతు అంది.
ఓ వైపు గీతు ఆటతీరుతో ఆకట్టుకుంటోంది అనుకుంటున్న ప్రేక్షకులతో పాటు, మరో వైపు ఏంది సామి ఈ అమ్మాయి ఇలా చేస్తోంది అని అనుకునేవాళ్ళు లేకపోలేదు. అయితే రెండు జంటలను స్వాప్ చేసే అవకాశం గీతుకి లభించింది. దీంతో శ్రీహాన్, రేవంత్ ల ఫ్రెండ్‌షిప్ దెబ్బతీయాలని వాళ్ళిద్దరిని స్వాప్ చేసింది. అలా చేయగానే "ఆడటం చేతకానప్పుడు ఇలానే ఉంటుంది" అని రేవంత్ అన్నాడు.
బిగ్ బాస్ చెప్పే రూల్స్ కాకుండా సంచాలకురాలిగాగీతు చెప్పినట్లు చేయాలని భావించి అందరికి తన నియమాలు చెప్పగా, "నువ్వు ఏంది నాకు చెప్పేది బోడి?" అని రేవంత్ అన్నాడు. "పక్కనోళ్ళతోని గేమ్ ఆడించేదినా గేమ్" అని గీతు అంది. "పక్కనోళ్ళతో నువ్వు ఆడించేది ఏంది బోడి. వాళ్ళకి ఆడరాదా" అని రేవంత్ అన్నాడు.
అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌లో గీతు పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా సరే తననే తప్పుగా చూస్తారు. ఎందుకంటే "వేరేవాళ్ళని ఆడించడానికి, గెలిపించడానికి కాదు మనం బిగ్ బాస్ కి వచ్చింది. మన గేమ్ మనం ఆడాలి" అని చెప్పిన గీతు..ఇప్పుడు తన గేమ్ వేరేవాళ్ళని ఆడిపించాలనిచెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రేక్షకులు.