English | Telugu

'సూర్యని టాప్‌లో ఉండనివ్వొద్దు'.. ఇనయా పంతం!

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకు మారుతున్న అంచనాలు, సన్నివేశాలు. అలాగే హౌస్ మేట్స్ప్రవర్తన కూడా మారుతోంది. అయితే హౌస్ లో మొదట్లో సూర్య ఎక్కువగా ఆరోహితో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆరోహి వెళ్ళిపోయాక ఇనయాతో సన్నిహితంగా ఉన్నాడు. లాస్ట్ వీక్ లో జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ఇనయాకి సూర్య హెల్ప్ చెయ్యకపోవడంతో అతనితోఇనయా మాట్లాడట్లేదు. దానికి గాను ఈ వారం‌ సూర్యని నామినేట్ చేసింది.

ఇన్ని రోజులుగా హౌస్ లో,ప్రేక్షకులలో ఒకటే ఫీల్ ఉండేది.. వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అని. అలా అనిపించేలా వాళ్ళ ప్రవర్తన కుడా ఉండేది. కాగా ఇనయా అందరికి క్లారిటీ ఇస్తూ, "సూర్య నా క్రష్" అని కూడా చెప్పింది. గత వారం నాగార్జున కూడా ఇనయాని అన్నాడు. "ఇనయా‌ పొద్దుతిరుగుడు పువ్వు. సూర్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటావు" అని అన్నాడు. అంత సన్నిహితంగా ఇద్దరూఉండేవారు.

ఒక్కసారిగా ఇద్దరూశత్రువులుగా మారారు. ఎంతలా అంటే "సూర్యని టాప్-5 లో ఉండనివ్వను" అనేంతలా, సూర్య పై కోపం పెంచుకుంది ఇనయా. అయితే రేవంత్‌తో, "సూర్య ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. తనతో ఉంటే తన గురించి అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది" అని ఇనయా చెప్పుకొచ్చింది.

కాగా సూర్య, వసంతితో మాట్లాడుతూ, "ఇనయా ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇలా చేంజ్ అవ్వడం ఏంటీ? ఎందుకు వట్టిగనే ట్రిగ్గర్ అవుతోంది. అంత క్లోజ్ గా ఉండి, ఒక్కసారిగా ఇలా ప్రవర్తిస్తోంటే సరికి బాధేస్తోంది" అని అన్నాడు. ఈ వారం ఒక్కొక్కరుగా ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరు నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్నుండి సేవ్ అయితే హౌస్ లో ఎప్పుడు కలిసి ఉండే వీరిద్దరు మళ్ళీ కలుస్తారో? లేదో? చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.