English | Telugu
మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్.. మనం పెళ్లి చేసుకుందాం!
Updated : Nov 21, 2022
ఈటీవీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈవారం 'కమనీయం కార్తీకం'షోతో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి వ్యవహరించారు. ముందుగా ఈ షోని కారుణ్య పాడిన అద్భుతమైన శివుడి భక్తిగీతంతో మొదలు పెట్టారు. ఆ పాట వినేసరికి రోహిణి పూలమాల తెచ్చి కారుణ్య మేడలో వేసేసింది. "మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్ గా ఉంటున్నాం.. మనం పెళ్లి చేసుకుందాం" అని సడెన్ గా ప్రపోజల్ పెట్టేసరికి కారుణ్య షాకయ్యాడు.
"ఏమిటి ఇవ్వాళ చాలా హెవీ టాపిక్ మాట్లాడుతున్నారు" అని కారుణ్య అడిగేసరికి "మిమ్మల్ని నా నుదిటిన ఒక బొట్టు పెట్టమని అడుగుతున్నా" అంది ఫన్నీగా. "ఎందుకు రోహిణి పెళ్లి చేసుకుని మావాడిని బలి చెయ్యాలని చూస్తావ్" అని రవి అనేసరికి, "నేను బలి చేయాలని చూడడం లేదు పెళ్లి చేసుకుని ఆయనకు ఒక జీవితాన్ని ప్రసాదిద్దామని అనుకుంటున్నా" అంది రోహిణి.
"ఇంక నువ్ పెళ్లి చేసుకున్నాక ఆయనకు ఇంకేం మిగులుతుంది జీవితం" అని కౌంటర్ వేసాడు రవి.దీంతో ఈ కామెడీ కౌంటర్స్ ని, పెళ్లి ప్రొపోజల్స్ ని తప్పించుకుని కారుణ్య అక్కడి నుంచి జంపింగ్ జపాంగ్ ఇపోయారు.