English | Telugu

హాట్ పెర్ఫార్మెన్సెస్ తో హీటెక్కించిన కంటెస్టెంట్స్..ఏడ్చేసిన సదా

"బీబీ జోడి" డాన్స్ షో హిట్ అయ్యిందో లేదో కానీ "నీతోనే డాన్స్" షోలో మాత్రం ప్రతీ వారం అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి పెర్ఫార్మెన్సెస్. ఇక నెక్స్ట్ షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే అలా ప్రోమోని కట్ చేసారు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో మంచి జోష్ నింపడానికి బీబీ జోడి కంటెస్టెంట్స్ కూడా యాడాన్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు కలిసి దుమ్ము లేపేశారు. మంచి డాన్స్ తో పాటు అక్కడక్కడా క్రిస్పీగా గొడవలు, రొమాన్స్ మామూలే.. నెక్స్ట్ వీక్ 'తీన్ కా తడ్కా' అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక స్టేజి మీద మెహబూబ్ రాగానే శ్రీముఖి "విప్పెయ్, విప్పెయ్.. చొక్కా విప్పెయ్ సిక్స్ ప్యాక్ చూడాలి" అంటూ కామెడీ చేసింది.

రాధ "నేను నీ సిక్స్ ప్యాక్ చూసాను" అంటే "అవునా నేను చూడలేదు..ఒన్స్ మరి" అంటూ డైలాగ్స్ వేశారు సదా. ఇక డాన్స్ పెర్ఫామెన్స్ విషయానికొస్తే నిఖిల్-కావ్య జోడి తేజస్వితో కలిసి మంచి రొమాంటిక్ పెర్ఫామెన్స్ చేశారు. అది చాలా హాట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆట సందీప్- జ్యోతి కలిసి శ్రీసత్యతో చేసిన పెర్ఫామెన్స్ కూడా మంచి హిట్ కొట్టింది. ఇక షో మధ్యలో 'జాతిరత్నాలు' హీరో నవీన్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వచ్చాడు. రాధా మేడం "మా నాన్న మీకు మంచి ఫ్యాన్ కాదుకాదు క్రష్" అన్నారు అనేసరికి రాధ థ్యాంక్యూ చెప్పారు. తర్వాత "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి ఈ ఇద్దరూ డాన్స్ చేశారు. సదాతో కలిసి "రాను రానంటూనే చిన్నదో" సాంగ్ కి కూడా డాన్స్ చేశారు. తర్వాత అమర్ దీప్-తేజు కలిసి అభినయశ్రీతో సుహాసిని డాన్స్ పెర్ఫామెన్స్ కి సదా కంట తడి పెట్టుకున్నారు. అడవుల్ని కొట్టేస్తుంటే అక్కడ ఉన్న జంతువులు తమ బాధను చెప్పుకోవడానికి మాటలు రావు కాబట్టి వాటి బాధను చెప్పుకోలేకపోతున్నాయి. వాటి బాధను మీరు చాలా బాగా చేసి చూపించారు అని చెప్పారు సదా. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పేరుతో అడవుల్ని, జంతువుల్ని ఇష్టపడే సదా వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.