English | Telugu

బిబి బజ్ ప్రోమో అవుట్.. గీతు రాయల్ మాస్ జాతర షురూ!

బిబి బజ్ ప్రోమో అవుట్.. గీతు రాయల్ మాస్ జాతర షురూ!

తెలుగులో వచ్చే టీవీ షోలలో బిగ్ బాస్ కి ఉండే క్రేజే వేరు. ఐపీఎల్ కి ఉండే క్రేజ్ ఇండియా మొత్తం ఉంటే తెలుగు బిగ్ బాస్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందనడంలో ఆశ్చర్యమే లేదు. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తిచేసుకొని ఏడవ సీజన్లోకి అడుగుపెట్టింది.‌ బిగ్ బాస్ సీజన్-7 కి హోస్ట్ గా నాగార్జున చేయగా, ఈ సారి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వచ్చారు. ప్రియాంక సింగ్, యాక్టర్ శివాజీ, సింగర్ దామిణి, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతికరోజ్, పల్లవి ప్రశాంత్, షకీల, కిరణ్ రాథోడ్, శుభశ్రీ, టేస్టి తేజ, అమర్ దీప్, ఆట సందీప్, శోభా శెట్టి కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. 

ఈ సారి బిగ్ బాస్ లో ఉల్టా పల్టాగా సాగుతుంది. ప్రతీ సీజన్ లో కంటెస్టెంట్స్ రావడం, టాస్క్ లు ఆడటం, నామినేషన్స్, వీక్లీ ఒకటి రెండు ఎలిమినేషన్లు ఇలా సాగుతుండగా.. ఈ సారి మాత్రం వచ్చిన కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చి హౌజ్ మేట్ గా స్థానం దక్కించుకోవడం. ఇలాంటి కొత్త కొత్త ట్విస్ట్ లతో కొనసాగుతుంది. అయితే ఇదంతా ఇలా సాగుతుందనగా బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో? వారికి ఎగ్జిట్ ఇంటర్వూ ఉంటుంది. బిబి బజ్ గా ఈ ఇంటర్వ్యూ ప్రతీ సీజన్ కొనసాగుతుంది. గత సీజన్ కి యాంకర్ శివ బిబి బజ్ కి యాంకర్ గా చేశాడు. అయితే ఈ సారి చిత్తూరు చిరుత గీతు రాయల్ చేయనుంది. దీంతో బిగ్ బాస్ సీజన్-7 కి ఎంత క్రేజ్ ఉందో, ఇప్పుడు ఈ బిబి బజ్ కి అంత క్రేజ్ వచ్చేసింది.

చిత్తూరు చిరుతగా బిగ్ బాస్ సీజన్-6లోకి అడుగుపెట్టిన ఆడ శివంగి గీతు రాయల్ కి ఉండే క్రేజే వేరు. బిగ్ బాస్ సీజన్-6 లో మోస్ట్ పవర్ ఫుల్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న గీతు.. అతి ఎక్కువ ఫ్యాన్ బేస్ ని కలిగి ఉంది. ఆమె క్రేజ్ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోయింగ్, ఫ్యాన్ పేజ్ లు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంటలిజెన్స్, స్మార్ట్ అండ్ గేమ్ ఛేంజర్ గా బిగ్ బాస్ సీజన్-6 లో తన తోటి కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడుకున్న గీతు రాయల్.. ఇప్పుడు బిబి బజ్ కి యాంకర్ గా చేయనుంది. ఈ ప్రోమో తాజాగా వచ్చింది.  ఆటేమో ఇంత హాడావిడేమో ఇంత నిజమేనా, కుందేలు, తాబేలు కథలో తాబేలు పరిగెత్తింది కాబట్టి గెలవలేదు. కుందేలు నిద్రపోయింది కాబట్టి తాబేలు గెలిచింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ప్రోమోలోనే ఫ్రై చేయడమంటే ఏంటో చూపించేశారు మేకర్స్. కాగా ఇప్పుడు ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది‌.