English | Telugu

బిగ్ బాస్ హౌజ్ లో బీపీ స్టార్‌!

బిగ్ బాస్ మూడవ రోజున కొంతమంది కంటెస్టెంట్ లు.. ఎవరికి వారే తమ నటనతో బిగ్ బాస్ ని మెప్పించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఇంకా హౌస్ లోకి ఎందుకు వచ్చారో తెలియని అయోమయంలో ఉంటే మరికొందరు మాత్రం.. ఇంక బిగ్ బాస్ అసలైన గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అన్న ఆత్రుతతో ఉన్నారు.

బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డ కంటెస్టెంట్స్ తమ అతి చేష్టలతో ప్రేక్షకులకు కొంచెం చిరాకు తెప్పించారు. ప్రిన్స్ యావర్ లేడీ గెటప్ లో చేసిన, తన‌ నటనతో బిగ్‌ బాస్ ని మెప్పించలేకపోయాడు. ఎప్పటికప్పుడు ఫన్ టాస్క్ ఇస్తూ కొంతమేరకు ఎంటర్టైన్మెంట్ అందించడంలో బిగ్బాస్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. శివాజీ కిచెన్ ఏరియాకీ వచ్చి ఒక్క కాఫీ ఇవ్వమంటే ఇవ్వరు. నేను వెళ్లపోతా, బిగ్ బాస్ బొంగులో బాస్ అంటూ గట్టి గట్టిగా అరిచేశాడు. అది చూసిన షకీల.. ప్లీజ్ బిగ్ బాస్ తనకి‌ ఒక కాఫీ పంపించండండూ బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత పది నిమిషాల్లో బిగ్ బాస్ కాఫీ పంపిస్తాడని శివాజీతో షకీల అంటుంది.

బిగ్ బాస్ మాత్రం శివాజీకి బీపీ చెక్ చెయ్యమని బీపీ మెషిన్ ని పంపించి గౌతమ్ కృష్ణతో చెక్ చేయమని చెప్తాడు. దాంతో ఇంక రెచ్చిపోయిన బీపీ స్టార్ శివాజీ.. నాకు ఏం చెక్ చెయ్యవద్దంటూ బిగ్ బాస్ నే తిడతాడు. స్టేతస్కోప్ తో అందరి గుండె చప్పుడు విని వాళ్ళేం అనుకుంటారో చెప్పమని రితికకి చెప్తాడు బిగ్ బాస్. నా గుండె చప్పుడు తప్ప అందరి గుండె చప్పుడు వినండి, ఏం అనుకుంటున్నారు? ఫన్ క్రియేట్ చెయ్యమని చెప్తే అసలు అర్థమేంటి? నన్ను ఇంట్లో హౌస్ మేట్ గా చూడట్లేదా అని అందరిపై విరుచుకుపడుతాడు శివాజీ.‌ కాసేపటికి శివాజీని బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్ కి పిలిచి కాఫీ ఇచ్చి పంపిస్తాడు. అసలు విషయమేంటే.. శివాజీ తన నటన స్టార్ట్ చేసే ముందు.. బిగ్ బాస్ హౌజ్ లోని ఒక‌ కెమెరా ముందుకి వెళ్ళి ' యాక్టింగ్ స్టార్ట్ ' అని చెప్పి మొదలెడతాడు. ఈ విషయం ఎవరికీ తెలియక హౌజ్ లోని వారంతా నిజమని భ్రమపడతారు. ఇక చెలరేగిపోయిన శివాజీ హౌజ్ లోని వాళ్ళకి తన నట విశ్వరూపం చూపించాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.