English | Telugu
కెప్టెన్ ప్రశాంత్ తో గౌతమ్ రూడ్ బిహేవియర్.. శివాజీతోను అదే పంతం!
Updated : Oct 11, 2023
నదిలోకి కొత్త నీరు వచ్చినట్టుగా.. బిగ్ బాస్ హౌజ్ లోకి కొత్త కంటెస్టెంట్స్ రావడంతో పాత కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా సెట్ అవుతున్నారు. బిగ్ బాస్ 2.0 లో వచ్చిన అంబటి అర్జున్, నయని పావని, భోలే శావలి, అశ్విని శ్రీ, పూజా మూర్తి తమ మాటతీరుతో ఇప్పుడిప్పుడే మిగతా కంటెస్టెంట్స్ కి దగ్గరవుతున్నారు.
మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అంటు అర్జున్ రెడ్డి తరహాలో గౌతమ్ కృష్ణ వచ్చాడు. వచ్చీ రాగానే మిగిలిన కంటెస్టెంట్స్ తో రూడ్ గా మాట్లాడాడు. హౌజ్ కి కెప్టెన్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చిన ఇవ్వలేదు గౌతమ్. దీంతో మరింత నెగెటివ్ అయ్యాడు గౌతమ్.
ఇప్పటికే గౌతమ్ కి అసలు ఆడటం రాదు, మాట్లడటం రాదని అనుకున్న ప్రేక్షకులు ఈ ఒక్క సీన్ తో ఈ వారం ఎలిమినేషన్ ఖాయమనిపిస్తుంది. ఇదే విషయం గురించి భోలే శావలి కూడా గౌతమ్ కృష్ణతో మాట్లాడాడు. అతను ఈ హౌజ్ కి కెప్టెన్.. మీరు ముందు వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వండని గౌతమ్ తో భోలే శావలి అన్నాడు. అయిన గౌతమ్ తన పంతాన్ని వీడకుండా.. తర్వాత చేస్తానని అన్నాడు. ఇక ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులకు ఫుల్ నెగెటివ్ అయ్యాడు గౌతమ్ కృష్ణ.
గత వారం శుభశ్రీ నామినేషన్ తర్వాత సీక్రెట్ రూమ్ కి వెళ్ళిన గౌతమ్.. అందులో ఎవరేంటి అని చూశాడు. అయినా ఆ సీరియల్ బ్యాచ్ ఏంటో తెలుసుకోలేకపోయాడు. ప్రతీ వారం తప్పులు చేస్తూ, ఫౌల్ గేమ్స్ ఆడుతు, తనతోనే స్ట్రాటజీ ప్లే చేసిన ఆట సందీప్ ని నామినేషన్ లో నుండి సేవ్ చేశాడు గౌతమ్. ఈ నిర్ణయంతో గౌతమ్ కృష్ణని ఒక పెద్ద జోకర్ వచ్చేశాడంటూ నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ లో ట్యాగ్ లు చేస్తూ ట్రోల్స్ చేస్తుంటే..
ప్రోమోలో కామెంట్లతో మోత టాస్క్ లు మొదలుపెట్టేశాడు బిగ్ బాస్. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తే మరింత నెగెటివ్ అవుతున్న గౌతమ్ హౌజ్ లో ఉండటం కష్టమే.. ఎవరి స్ట్రాటజీ వారికుంటుంది. గౌతమ్ రాగానే శివాజీని అడిగి విధానం, అడిగిన క్వశ్చన్ రెండూ తప్పే. ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంట్ లేకుండా తిరగడం కాదు కదా అన్న, డోంట్ జడ్డ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని శివాజీని గౌతమ్ అనగా.. నాకు అనిపించింది నేను చెప్పాను. తమ్ముడు నీ రీజన్ నువ్వు చెప్పమని శివాజీ అన్నాడు. అయిన తన పద్దతి మార్చుకోకుండా శివాజీతో వాగ్వాదానికి దిగాడు గౌతమ్. దీంతో తర్వాత రోజుల్లో ఈ ఆట మరింత ఇంట్రస్ట్ గా మారనుందని బిగ్ బాస్ అభిమానులకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.