English | Telugu
అమర్ దీప్ వర్సెస్ అంబటి అర్జున్..
Updated : Oct 11, 2023
బిగ్ బాస్ హౌజ్ లో ఆరవ వారం హుషారుగా మొదలైంది. పాత కంటెస్టెంట్స్ కి లగేజ్ ని లిమిట్ గా వాడుకోమని.. లగేజ్ కి కాపలాగా అంబటి అర్జున్, అశ్విని శ్రీని నియమించాడు బిగ్ బాస్. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆట సందీప్, టేస్టీ తేజ కలిసి దొంగతనం చేశారు.
ఎపిసోడ్ మొదలవగానే అశ్వత్థామ 2.0 అంటూ ఆటలో అరటిపండు గౌతమ్ కృష్ణ వచ్చాడు. అందరి కన్నా నేనే తోపు అన్నట్టు ఓవారక్షన్ చేశాడు. వచ్చీ రాగానే కెప్టెన్ ప్రశాంత్ పలకరిస్తూ, షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఇవ్వకుండా పంతాన్ని చూపించి మరింత నెగెటివ్ అయ్యాడు. ఆ తర్వాత శివాజీతో గొడవకి దిగి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. కిచెన్ లో తన ఆధిపత్యం తగ్గిందని ప్రియాంక జైన్ తెగ బాధపడుతూ శోభా శెట్టికి చెప్పింది.
ఇక భోలే కిచెన్ లోకి దూరి తనకి నచ్చింది చేస్తూ, హౌజ్ మేట్స్ లో మంచి ఫేమ్ తెచ్చుకోవడానికి శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొత్త కంటెస్టెంట్స్ రాగేనే పులిహోర బ్యాచ్ లా తయారయ్యారు. అశ్విని, నయని పావని ఇదే పనిలో ఉన్నారు. ఇకవేళ ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ వీళ్ళ ట్రాప్ లో పడితే అంతే. ఇక మన సీరియల్ బ్యాచ్ అంతా కలిసి కొత్త వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా తెలస్తుంది. అమర్ దీప్ కి ఎవరు పడితే వాళ్ళు జ్ఞాన భోద చేస్తూనే ఉన్నారు.
అమర్ దీప్ లో చాలా వరకు మార్పు వచ్చింది. అగ్రెసివ్ పోయి, ఆలోచించడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక కొత్త కంటెస్టెంట్స్ లో తనకే సపోర్ట్ చేస్తూ తనతోనే ఉంటాడనుకున్న అంబటి అర్జున్ కూడా అమర్ దీప్ ఆట సరిగ్గా లేదని చెప్పడంతో మరింతగా డల్ అయినట్టు తెలుస్తోంది.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. కొత్త కంటెస్టెంట్స్ లో గౌతమ్ కృష్ణ చేరిన విషయం తెలిసిందే. ఇక కొత్త కంటెస్టెంట్స్ ఒక వైపు , పాత కంటెస్టెంట్స్ ఒకవైపు ఉన్నారు. హౌజ్ లోని వారిలో ఎవరు ఫిట్ గా ఉన్నారో వారే విజేత అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో బయట ఉన్న టైర్ లని, స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్న నెంబర్ లని వెతికి తెచ్చి బయట ఉన్న తమ పార్ట్ నర్ కి ఇస్తే బయట ఉన్న అతను అదే నెంబర్ గల టైర్ ని తెచ్చి ఇవ్వాలి.
ఆ టాస్క్ లో యావర్-ఆట సందీప్ ఒకవైపు, అంబటి అర్జున్-గౌతమ్ కృష్ణ ఒకవైపు ఉన్నారు. ఈ టాస్క్ లో అంబటి అర్జున్- గౌతమ్ కృష్ణ గెలిచారు. ఇక ఆ తర్వాత జీనియస్ ఎవరు అనే టాస్క్ లో గౌతమ్ కృష్ణ- అమర్ దీప్ లు పాల్గొనగా అమర్ దీప్ అన్నీ తప్పులే చెప్పడంతో, టేస్టీ తేజని ఆటగాళ్ళ టీమ్ నుండి పంపించారు. ఈ టాస్క్ లో టేస్టీ తేజ వన్ మ్యాన్ షో గా ఆడాడు. అయితే బిగ్ బాస్ క్వశ్చన్ అడుగకముందే టేస్టీ తేజ బజర్ ప్రెస్ చేయడం వల్ల నెగెటివ్ పాయింట్లు వచ్చాయి. ఇలా టాస్క్ లు మొదలైన మొదటి రోజునే కొత్త కంటెస్టెంట్స్ రెండు టాస్క్ లలో గెలిచారు. మరి తర్వాత జరిగే కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి!