English | Telugu

'నా బొమ్మ‌లు తీసిన‌వాళ్ల‌కి కొంచెమైనా సిగ్గుండాలి'.. రేవంత్ ఫైర్‌!

ప‌దిహేడో రోజు హౌస్‌లో "గేమ్ ని గేమ్ లా ఆడుతున్నారా ఎవరైనా, నా బొమ్మలు ఎవరో తీసారు. కొంచెం ఐనా సిగ్గుండాలి తీసినవాళ్ళకి. మళ్ళీ గుసగుసలు, నీతి సూక్తులు, నీతి కబుర్లు" అని శ్రీహాన్ తో చెప్పాడు రేవంత్. కోపంతో ఉన్న అత‌డిని చూసింది ఆరోహి. "రేవంత్ మంచి ఫైర్ మీదున్నాడు" అని నేహాతో చెప్పింది. "ఫైర్ మీద కాకపోతే మంచు మీద ఉండమను నాకేంటి?" అంది నేహ‌.

ఆ తర్వాత"కొన్ని కొన్ని వదలడానికి నాకు కొంచెం టైం పడుతుంది" అని గీతూతో చెప్పాడు సూర్య. "గీతూ మీరు మీ బ్యాటరీస్ ని మార్చుకోండి" అని బిగ్ బాస్ సూచించాడు. మరోవైపు రేవంత్ తన బొమ్మలు ఎవరైనా, ఎక్కడైనా దాచారేమో అని వెతుకుతూ ఉన్నాడు. "రేవంత్! మీరు చేస్తున్న పనిని తక్షణమే ఆపేయండి" అని బిగ్ బాస్ అత‌డిని హెచ్చరించాడు.

ఆ తర్వాత "నా టీం లో ఎవరూ ఫేర్ గేమ్ ఆడట్లేదు. నేనెందుకు ఆడాలి" అని రేవంత్, గీతూతో చెప్పాడు. "అందరూ వాళ్ళ గేమ్ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆడుతున్నారు. ఒక్క నువ్వు తప్ప. గేమ్‌లోనీతి, నిజాయితి కాదు కావాల్సింది. తెలివితో ఆడాలి. రూల్స్ బ్రేక్ చేయకుండా మన గేమ్, మనం ఆడాలి. ఇంకొకరిని గెలిపించడానికి కాదు, మనం గెలవడానికి ఆడాలి. అదే అసలైన గేమ్ ప్లాన్ " అని గీతూ, రేవంత్ తో చెప్పుకొచ్చింది. ఇలా పదిహేడవ రోజు గడిచింది.