English | Telugu

అనుదీప్ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళను కొట్టి మరీ నవ్వుతాడు

జాతిరత్నాలు మూవీ ద్వారా ఒక ఫేమ్ తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సంతోష్ శోభన్ తో కలిసి జంటగా నటించిన చిత్రం ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా షోకి వచ్చారు ఇద్దరూ. ఇటీవల ఫరియా, సంతోష్ బిగ్ బాస్ సీజన్ 6 లో నాగార్జునతో కలిసి సందడి చేశారు.

ఇక జాతిరత్నాలు షూటింగ్‌ టైమ్‌లో ఆ మూవీ డైరెక్టర్ అనుదీప్ కొట్టడంపై ఆలీ అడిగిన ప్రశ్నకు ఫరియా క్లారిటీతో సమాధానం చెప్పింది. ‘ డైరెక్టర్ అనుదీప్ కి ఒక మేనరిజమ్ ఉంది.. ఏదైనా జోక్ విన్నా.. చెప్పినా నవ్వుతూ పక్కన ఎవరు ఉంటే వాళ్ళను కొడుతుంటాడు. షూటింగ్ టైంలో అనుదీప్ అందరితో చాలా ఫన్నీగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేస్తూ నవ్విస్తుంటారు. జాతిరత్నాలు మూవీ షూటింగ్ సమయంలో అలాగే ఆయన ఒక జోక్ వేశారు.. ఆ సమయంలో ఆయన పక్కన నేనే ఉన్నాను..ఆ జోక్ కి ఆయన నవ్వుతోనే నన్ను సరదాగా కొట్టారు .. దాన్ని చూసి అందరూ వేరే రకంగా ఊహించుకున్నారు. ఇది జస్ట్ ఫన్నీగా జరిగింది మాత్రమే..వేరే సీరియస్ రీజన్స్ అంటూ ఏమీ లేవు ’ అంటూ క్లారిటీ ఇచ్చింది.