English | Telugu
'నోరు మూసుకుని వెళ్లి కూర్చో!'.. ఆదిని రఫ్ఫాడించిన పూర్ణ!!
Updated : Nov 3, 2022
ఢీ - 14 డాన్సింగ్ ఐకాన్ క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసింది. కంటెస్టెంట్స్ ఎంతో పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశారు. ఇక క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఎవరు సెమీ ఫైనల్స్ కి అడుగు పెడతారో చూడాలి. ఇక ఈ డాన్స్ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో పూర్ణ, గణేష్, యాని మాస్టర్స్ వచ్చారు. ఇక హైపర్ ఆది మామూలుగానే ఎంటర్టైన్ చేసాడు. టీం లీడర్ శ్వేతా నాయుడు "నీతోనే డాన్స్ టునైట్" అనే సాంగ్ కి డాన్స్ చేసింది.
ఆమె పక్కనే ఆది మాస్ స్టెప్స్ వేసాడు అదే సాంగ్ కి. ఇంతలో ప్రదీప్ వచ్చి "ఫేస్ ఆఫ్ లో ఇద్దరిలో ఎవరి డాన్స్ బాగుందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం" అనేసరికి "శ్వేతాదే బాగుంది" అని పూర్ణ అంది. "సీరియస్లీ ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు" అని వెళ్ళిపోయాడు ఆది. "నువ్వు ఇలా ప్రవర్తించకూడదు" అని కౌంటర్ వేసింది పూర్ణ.
"నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు" అనేసరికి "సిగ్గుంటే వెళ్ళిపో, సిగ్గు లేదంటే స్టేజి మీదకు రా" అని పూర్ణ కూడా సీరియస్ గానే చెప్పింది. "నాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు, ఫ్యూచర్ లో మీరే చూస్తారు నా సిగ్గేమిటో" అన్నాడు సీరియస్ గా ఆది. "సరేలేగాని నోరు మూసుకుని వెళ్లి కూర్చో" అంది పూర్ణ. ఇలా రాబోయే ఢీ ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగానే కాకుండా చాలా టఫ్ కాంపిటీషన్ తో అలరించబోతోంది.