English | Telugu
సింగర్ ఐన ఫైమా...? షాకవుతున్న నెటిజన్స్
Updated : Oct 26, 2023
సుమ అడ్డా షో ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ షోకి టాప్ సింగర్స్ శ్రీకృష్ణ, కొమండూరి సాకేత్, మోహన భోగరాజు రాగా వాళ్ళతో లేడీ కమెడియన్ ఫైమా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక వీళ్లకు సుమ వేరేవేరే ఊళ్లు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు అనే టాస్క్ ఇచ్చింది. చైనా బాషాని సాకేత్ తో మాట్లాడించింది...తర్వాత చెన్నై బాషా మాట్లాడించింది. ఇప్పుడు మీరు కేరళలో ఉన్నారు కేరళ బాషా మాట్లాడండి అనేసరికి "కేరళ అమ్మాయిలు బాగుంటారు" అని శ్రీకృష్ణ కామెంట్ చేసేసరికి హోస్ట్ సుమ తెగ సిగ్గుపడిపోయింది. తర్వాత ఫైమా చంద్రముఖి మూవీ నుంచి జ్యోతిక చేసిన డాన్స్ చేసి కాస్త హడావిడి చేసి అందరినీ ఎంటర్టైన్ చేసింది.
తర్వాత "ఏ శ్వాసలో చేరితే" అని సాంగ్ పాడుతూ ఫైమా ఇల్లు ఊడుస్తూ ఉండగా శ్రీకృష్ణ వచ్చి "నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను" అనడంతో "అమ్మో మా అమ్మ తిడుతుంది" అని ఫైమా కౌంటర్ వేసింది. తర్వాత సుమ "వెల్కమ్ టు బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షో" అనేసరికి మోహన భోగరాజు ఒక పాట పడింది తర్వాత ఫైమా వచ్చి "ఏ శ్వాసలో" సాంగ్ ని పాడి వినిపించింది. దానికి సుమ 200 మార్క్స్ ఇచ్చి ఫైమా విన్నర్ అని చెప్పేసరికి ఫైమా ఏడ్చేసింది. "ఏమ్మా ఏమయ్యింది" అని సుమ అడిగేసరికి "ఇన్ని రోజులు నేను పాడుతుంటే బాత్ రూమ్ సింగర్ అన్న మీరే ఇప్పుడు 200 మార్కులు ఇచ్చారు" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇలాంటి టాప్ సింగర్స్ మధ్యలో ఫైమా వచ్చి సరదాగా ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ మాత్రం " నలుగురు సింగర్స్ అన్నారు కదా, ఫైమా సింగర్ ఎప్పుడు అయ్యారు " అంటూ ఆరాతీస్తుంటే ఇంకో నెటిజన్ బాత్రూం సింగర్ అని రిప్లై ఇచ్చారు"...