English | Telugu
దారి మర్చిపోయి వర్ష ఇంటికి వెళ్లిన కృష్ణ భగవాన్
Updated : Oct 26, 2023
ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రతీ వారం మరీ అంత ఎంటర్టైన్ చేయకపోయినా కొన్ని స్కిట్స్ మాత్రం కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇక ఈ వారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఇమ్మానుయేల్ - వర్ష టీమ్ కృష్ణ భగవాన్ ని టార్గెట్ చేస్తూ స్కిట్ వేశారు. "రాత్రి కృష్ణ భగవాన్ గారు మన ఇంటికి వచ్చేరేమిటి" అని ఇమ్ము వర్షాని అడిగాడు. "ఆయన అడ్రస్ మర్చిపోయి మన ఇంటికి వచ్చారట" అని వర్ష ఆన్సర్ ఇచ్చింది. దానికి ఇమ్ము కృష్ణ భగవాన్ మీద ఫైర్ అయ్యాడు .." నేను తాగను అంటున్నా రాత్రి నాకు బాగా తాగించింది మా ఇంటికి రావడానికా" అని ఆయన్నే అడిగాడు ఇమ్ము. ఇక ఇమ్ము డైలాగ్ కి కృష్ణ భగవాన్ నవ్వేశారు. "రాత్రి కృష్ణ భగవాన్ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు" అని మళ్ళీ వర్షాను అడిగాడు ఇమ్ము. "ఆయన చాల మంచోరండి" అని వర్ష అనేసరికి " ఆయన మంచోరే..నేను ఆయన్ని అనుమానించట్లేదు..నిన్ను అనుమానిస్తున్నాను" అన్నాడు.
ఇక బులెట్ భాస్కర్ స్కిట్ లో ఫైమా చేసిన మహానటి నటనకు రష్మీ, సదా పగలబడి నవ్వేశారు. ఫైమాని భాస్కర్ గదమాయించి ఫైల్ మీద సంతకం పెట్టమని ఫోర్స్ చేసేసరికి సహనం చచ్చిపోయిన ఫైమా ఎటాక్ అని చెప్పి కమెడియన్ బాబుతో కొట్టించింది. బాబు కూడా భాస్కర్ ని చాలా గట్టిగానే పీకాడు. దానికి భాస్కర్ కి చాలా కోపం వచ్చేసింది "అరె బాబు ఇన్నిసార్లు నా స్కిట్స్ లో చేసావు కానీ ఎప్పుడైనా నీ పేమెంట్ ని ఎగ్గొట్టానా..ఎందుకురా అంత గట్టిగా కొట్టావ్" అని అడిగాడు భాస్కర్. ఇలా ఈ వారం ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది.