English | Telugu

సావిత్రి, శ్రీదేవిగా కార్తీకదీపం పిల్లలు


నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ షోలో లెజెండరీ యాక్టర్స్ శ్రీదేవి, సావిత్రి గారిని తలుచుకుని ఈ ఎపిసోడ్ ని డేడికేట్ చేశారు. ఇక శ్రీదేవి మూవీనే రీరిలీజ్ కావాలని ఒక గ్యాంగ్, కాదు శ్రీదేవి గారి మూవీనే రీరిలీజ్ కావాలని మరో గ్యాంగ్ మధ్య పోటీ జరిగింది. ఇక ఇందులో వాగ్దేవి సింగింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు.

"ప్రియతమా ప్రియతమ" అనే సాంగ్ పాడి వినిపించేసరికి "సాక్షాత్తు ఆ సరస్వతి దేవి కటాక్షం మీ మీద పరిపూర్ణంగా ఉంది" అంటూ ఇంద్రజ కంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత రష్మీ ఒక టాస్క్ ఇచ్చింది..ఒక సాంగ్ ట్రాక్ వస్తుంది దానికి సంబంధించిన ఐటెం టేబుల్ మీద ఉంది అని చెప్పింది. దానికి రాంప్రసాద్- కొమరక్కా-నటకుమారి స్టేజి మీదకు వచ్చారు. "ముద్దెపెట్టు ముద్దెపెట్టు" సాంగ్ ని ప్లే చేసేసరికి కొమరక్కా, నటకుమారి ఇద్దరూ కలిసి లిప్స్టిక్ పెదాలతో రాంప్రసాద్ ముఖం మీద ముద్దులు మీద ముద్దులు పెట్టేసి కిందపడేశారు.

తర్వాత "చిన్నగా చిన్నగా చిన్నగా" అనే సాంగ్ ప్లే చేసేసరికి రోహిణి, భావన ఇద్దరూ కలిసి నాటీ నరేష్ ని పట్టుకోవడానికి పరిగెత్తారు. నరేష్ మాత్రం వాళ్ళ చేతులకు చిక్కకుండా పారిపోయాడు. ఇక తర్వాత ఎండింగ్ లో మాత్రం కార్తీక దీపం సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్స్ సౌర్య అలియాస్ కృతిక సావిత్రి గెటప్ లో, హిమ అలియాస్ సహృద శ్రీదేవి గెటప్ లో వచ్చి డాన్స్ చేసి ఆడియన్స్ చేత స్టేజి మీద ఉన్నవాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక కీర్తి భట్, కార్తీక్ వచ్చి తమ లైఫ్ స్టోరీ చెప్పి ఇద్దరూ దండలు మార్చుకోవడంతో స్టేజి మీద ఉన్న వాళ్లంతా క్లాప్స్ కొట్టారు. ఇలా ఈ వారం ఎపిసోడ్ రాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.