English | Telugu
బుల్లెట్ భాస్కర్ తొక్కేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరు?
Updated : Jun 15, 2022
బుల్లితెర ప్రేక్షకులతో పాటు యూట్యూబ్ ప్రియుల్ని కూడా నవ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీ షో `జబర్దస్త్`. ఈ షో నుంచి వచ్చిన వాళ్లలో చాలా మంది పాపులర్ అయ్యారు. కొంత మంది సినిమాల్లోకి వెళ్లిపోయారు. కొంత మంది హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, హీరోలుగా కూడా మారిపోయారు. సినిమా అవకాశాలు రావడంతో చాలా మంది జబర్దస్త్ వీడి దూరంగా వుంటున్నారు. అయితే ఎంత మంది జబర్దస్త్ ని వీడి వెళ్లినా .. కామెడీ స్కిట్లతో కొంత మంది ఇప్పటికీ ఎంటర్ టైన్ చేస్తూనే వున్నారు.
అయితే ఈ షో నుంచి కొంత మంది కమెడియన్ లు గ్రూపు రాజకీయాలు.. కొంత మంది తొక్కేయడం లాంటి కారణాల వల్ల వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఇంద్రజ బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఈ షోలో భాగంగా ఇంద్రజ టీమ్ లీడర్ లు ఆటో రాం ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ లతో ప్రత్యేకంగా చిట్ చాట్ ని నిర్వహించింది. బుల్లెట్ భాస్కర్ ని ఉద్దేశిస్తూ `మీకు ఓ కో టీమ్ లీడర్ (అప్పారావు) ఉండేవారు. మీరు తొక్కేయడం వల్లనే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం అని అడిగింది ఇంద్రజ..
ఈ విషయంపై నేను స్పందించకూడదని అనుకున్నానని, ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే.. వెళ్లిపోయింది చాలా పెద్దాయన` అంటూ బుల్లెట్ భాస్కర్ ఏదో రీజన్ చెప్పాడు. ఇక ఆటో రాంప్రసాద్ పై కూడా ఓ బాంబు పేల్చింది ఇంద్రజ..` మీరు స్క్రిప్ట్ లు సరిగా రాయకపోవడం వల్లే మీ టీమ్ మెంబర్స్ (సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను) ఈ షో నుంచి వెళ్లిపోయారు. ఇది నిజమా? అని అడిగేసింది. ఈ ప్రశ్నకు హర్ట్ అయిన ఆటో రాంప్రసాద్ .. ఇంద్రజను ఇరికించే ప్రయత్నం చేశాడు. `రోజా గారు మినిస్టర్ కాకూడదని దేవుడికి మొక్కుకున్నారట.. ఎందుకు మేడమ్? అని షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.