English | Telugu
జబర్దస్త్‌లో ఫాహిమా టైమ్ మొదలైంది!
Updated : Jul 28, 2021
జబర్దస్త్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేవి రెండే. ఒకటి... కామెడీ. రెండు... గ్లామర్. ఆర్టిస్టులు చేసిన కామెడీ కంటే ఒక్కోసారి యాంకర్లు అనసూయ, రష్మీ వేసిన డ్రస్సులు హాట్ టాపిక్ అవుతుంటాయి. గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. 'జబర్దస్త్'లో అమ్మాయిలు అంటే అందమే హైలైట్ అవుతుంటుంది.
అందంతో కాకుండా కామెడీ టైమింగ్‌తో లేడీ కమెడియన్ ఫాహిమా కొట్టుకొస్తోంది. కలర్, లుక్స్ పరంగా చూస్తే అనసూయ, రష్మీ, వర్షలతో ఫాహిమాను కంపేర్ చేయలేము. కానీ, ఆమెకు రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. రెండు మూడు ఎపిసోడ్ల నుండి ఫాహిమా రెచ్చిపోతోంది. 'బులెట్' భాస్కర్ టీమ్ లో ఫైమాకు మంచి రోల్స్ పడ్డాయి. లేటెస్ట్ గా రిలీజైన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆమెకు రోల్ దక్కింది. వచ్చిన ఛాన్స్ దక్కించుకుని మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందుకు యూట్యూబ్ లో కామెంట్లు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సాధారణంగా 'జబర్దస్త్' ప్రోమో కింద హైపర్ ఆది గురించి, 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో కింద సుడిగాలి సుధీర్ గురించి ఎక్కువమంది కామెంట్లు చేస్తారు. కానీ, లేటెస్ట్ ప్రోమో కింద ఫాహిమా గురించి ఎక్కువమంది కామెంట్లు చేశారు. ఆడియన్స్ ఫాహిమాను మెచ్చుకుంటూ పోస్టులు చేశారు. ఇకనుండి జబర్దస్త్ షోలో ఫాహిమా టైమ్ మొదలైందని చెప్పవచ్చు.