English | Telugu
ఇక్కడయితే సుత్తి తీసుకున్నావ్? ఇంట్లో ఏం తీసుకుంటావ్?
Updated : Jul 28, 2021
భర్త మంజునాథ్ మాట వినేది లేదంటోంది యాంకర్ లాస్య. ఇంట్లో అయినా సరే... గేమ్ షోలో అయినా సరే... తనదే పైచేయి అంటోంది. ఓంకార్ షో 'సిక్స్త్ సెన్స్'కి మంజునాథ్, లాస్య దంపతులు వచ్చారు. కొరియోగ్రాఫర్ యష్ తన భార్యతో వచ్చాడు. వాళ్లిద్దరూ కలిసి డాన్స్ చేశారు.
యష్ కొరియోగ్రాఫర్ కాబట్టి డాన్స్ చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, భర్త మంజునాథ్ తో లాస్య డాన్స్ చేయించడం విశేషమే. ఈ వీకెండ్ లాస్య గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. రీసెంట్ గా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓంకార్ వేసిన ప్రశ్నలు, లాస్య చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
'మీ ఇంట్లో ఎక్కువగా ఎవరి మాట ఎవరు వింటుంటారు?' అని ఓంకార్ అడిగాడు. 'తెలియనిది ఏముంది అన్నా' అని లాస్య చెప్పింది. అంతటితో ఆగకుండా 'చెప్పండి చెప్పండి' అంటూ చేతిలో సుత్తిని పైకి ఎత్తింది. ఇంతలో పక్కనున్న మంజునాథ్, లాస్య మాట తాను వింటానన్నట్టు చేతులు ఆమెవైపు చూపించాడు. 'ఇక్కడయితే సుత్తి తీసుకున్నావ్? ఇంట్లో ఏం తీసుకుంటావ్?' అని ఓంకార్ మళ్ళీ ప్రశ్నించాడు. 'ఏది ఉంటే అది' అని ఠక్కున మంజునాథ్ నోటి నుండి ఆన్సర్ వచ్చింది.
'నా మాట వినకపోతే అలిగి వెళ్ళిపోతాను. అలకతో నాకు కావాల్సింది నేను సాధించుకుంటాను' అని లాస్య చెప్పుకొచ్చింది. అదీ సంగతి. ఇంట్లో లాస్య ఆయుధం అలక అన్నమాట.