English | Telugu

హోటల్ రూంలో ప్రోమో షూట్‌.. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్! 

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16 ప్రారంభం కాగా.. రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభ అయ్యింది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా.. సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది.. సెప్టెంబర్ 01 ఆదివారం నాటితో ముగియనుండగా.. ఆ తరవాతి ఆదివారం నుంచి ‘బిగ్ బాస్ 8’ ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా.. డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది.

గత సీజన్ లాగే ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు నెలాఖరు వరకూ బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టుడియోలో జరగబోతుంది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపికకి ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసి.. వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా.. జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఇలా ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్‌ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్‌లోకి పంపుతారనే గ్యారంటీ లేదు.. ఇంటర్వ్యూలు జరిగి.. హోటల్ రూంలో పెట్టి.. ప్రోమో షూట్‌లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకూ కూడా అంటే.. బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టే వరకూ కూడా ఫైనల్ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగొచ్చు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ లిస్ట్ ఓసారి చూసేద్దాం.. ఫార్మర్ నేత్ర , కిర్రాక్ ఆర్పీ, వేణు స్వామి,‌ అంజలి పవన్, మై విలేజ్ షో అనిల్ , ఖయ్యూం అలీ, యాదమ రాజు, సోనియా సింగ్ , బమ్ చిక్ బబ్లూ, ప్రభాస్ శీను, అమృత ప్రణయ్, రీతు చౌదరి, సింగర్ సాకేత్, ఢీ ఫేమ్ శ్వేతా నాయుడు, సీరియల్ నటి హారిక, సీరియల్ యాక్టర్ నిఖిల్, నీతోనే డ్యాన్స్ ఫేమ్ అక్షిత, సీరియల్ నటుడు శ్రీకర్.. వీరిని బిబి టీమ్ సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు బర్రెలక్క, కుమారీ ఆంటీ, యాంకర్ విష్ణు ప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి‌. ఈ లిస్ట్ లో ఎవరెవరు సెలెక్ట్ అయి హౌస్ లోకి వెళ్తారో చూడాలి మరి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.