English | Telugu
‘జబర్దస్త్’లో అసంతృప్తి జ్వాలలు! బయటపడిన వెంకీ!!
Updated : Aug 7, 2021
‘జబర్దస్త్’లో వెంకీ కొన్నేళ్ళుగా టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. ‘జబర్దస్త్’లో ‘వెంకీ మంకీస్’ టీమ్ కంటిన్యూస్‌గా స్కిట్లు చేస్తోంది. అతడి టీమ్‌లో ఉండి పేరు తెచ్చుకున్న జీవన్ ప్రజెంట్ టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. ప్రసాద్ మధ్యలో కొన్నిరోజులు నరేష్‌తో కలిసి టీమ్ లీడర్‌గా చేశాడు. తర్వాత ‘పంచ్ ప్రసాద్ – నాటీ నరేష్’ టీమ్‌ను తీసేశారు. దాంతో ఇప్పుడు వెంకీతో పాటు ఇతర టీమ్ లీడర్ల స్కిట్లలో చేస్తున్నాడు. టీమ్స్‌ను తగ్గించిన తర్వాత తాగుబోతు రమేష్‌ను తీసుకొచ్చి వెంకీ మంకీస్ టీమ్‌తో కలిపారు. దాంతో పేరు మొత్తం తనకు రావడం లేదనే అసంతృప్తి వెంకీలో ఉన్నట్టుంది. లేటెస్ట్ ‘జబర్దస్త్’ ప్రోమో సాక్షిగా అది బయటపడింది.
‘ఏం వెంకీ! ఏమైంది?’ అని జడ్జ్ మనో అడిగారు. ‘చేసేది నేను... చేయించేది నేను’ అని వెంకీ చెప్పాడు. అప్పుడు అతడి ముఖంలో సంతోషం అనేది లేదు. ‘నువ్వు చేయించినా వాళ్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు’ అని వెంకీ టీమ్‌లో ఇతర సభ్యుల్ని తక్కువ చేయకుండా చెప్పారు మనో. వెంకీ వెనక్కి తిరిగి అసంతృప్తికి లోనయ్యాడు. అతడి దగ్గరకు తాగుబోతు రమేష్ వెళ్ళగా, వద్దన్నట్టు సైగ చేశాడు. ఇదంతా ప్రోమోలో చూపించడం వల్ల ‘జబర్దస్త్’ షో నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారో?
‘జబర్దస్త్’ ఎంతోమంది కమెడియన్లకు వేదిక కల్పించింది. కల్పిస్తోంది. సినిమాల్లో నటీనటుల కంటే కొందరికి ఎక్కువ పేరు వస్తోంది. అయితే, షోలో కొందరు కమెడియన్లు అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవమే. అది తమకు వచ్చే పేరు విషయంలో కాదు, పేమెంట్స్ విషయంలో! క్యారెక్టర్ చిన్నదైనా కామెడీ బాగా చేస్తే ఆలోమేటిక్‌గా పేరు వస్తుంది. అందులో మరో సందేహం లేదు. కానీ, పేమెంట్స్ విషయంలో టీమ్ లీడర్లపై కొంతమంది ఫన్నీగా సెటైర్లు వేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు టీమ్ లీడర్‌లో రావడం గమనార్హం.