English | Telugu

చేయి కోసుకున్న బిగ్ బాస్ మాధురి.. సంచలన వివరాలు ఇవే

-మాధురి సంచలన వ్యాఖ్యలు
-బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది!
-మొత్తం చెప్పేసింది
-భరణి, డీమన్ పవన్, రీతూ చౌదరి పై కీలక వ్యాఖ్యలు

ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకునే ప్రేక్షకులు అత్యంత అమితంగా ఇష్టపడే రియాలిటీ షో బిగ్ బాస్ షో(Bigg Boss).కింగ్ నాగార్జున(Nagarjuna)హోస్ట్ గా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 'స్టార్ మా' వేదికగా ప్రసారం అవుతుంది. ఈ షో ద్వారా హౌస్ లోని కంటెంట్స్ తమకంటు ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళల్లో 'దువ్వాడ మాధురి' ఒకరు. ఇరవై రెండు రోజుల క్రితం హౌస్ లోకి ప్రవేశించిన మాధురిఎలిమినెట్ అవ్వడంతో బయటకి వచ్చింది. రీసెంట్ గా మాధురి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని హౌస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలని వెల్లడి చేసింది.

మాధురి మాట్లాడుతు నాకు ఓటింగ్ తగ్గిందంటే నేను నమ్మను. హౌస్ లో తమకి నచ్చిన వాళ్ళని ఉంచుతారు. నచ్చని వాళ్ళని బయటకి పంపిచేస్తారు. ఓటింగ్ విషయంలో గ్యాంబ్లింగ్ జరగవచ్చని నా నమ్మకం. హౌస్ లోకి వెళ్లిన రోజు నుంచే మా ఆయన గుర్తుకొచ్చి బయటకి వద్దామని అనుకున్నాను. పబ్లిక్ ఓట్ తో ఎలిమినేట్ అయిన భరణి మళ్ళీ పబ్లిక్ వోట్ తో ఎలా హౌస్ లోకి వస్తాడు. ఆయన గురువు గారు నాగబాబు(Nagababu)గారి వల్లనే హౌస్ లోకి వచ్చాడు.

భరణి తో నేను డాన్స్ చెయ్యడంలో కొంత మంది అశ్లీలత చూస్తున్నారు. ఇద్దరం చాలా దూరంగా డాన్స్ చేసాం. ఈ విషయంలో నన్ను ట్రోల్ చేసే వాళ్ళు అమ్మకి పుట్టలేదు బిగ్ బాస్ ఫస్ట్ టైం ఆఫర్ వచ్చినా వదులుకున్నాను. నేను చేయి కోసుకుని శ్రీనివాస్ గారిని ఒప్పించాననే వార్తలు కూడా అబద్దం.స్కిప్టెడ్ షో కాదు. రీతూ, డీమాన్ పవన్ ల లవ్ మాత్రం ఫేక్. ఓటింగ్ కోసం ఆలా క్యూట్ గా లవ్ లీగా మాట్లాడుకుంటు ఉంటారు.

Also read : అగ్ర హీరోపై 100 కోడిగుడ్లతో అమ్మాయిల దాడి

నాకు అది నచ్చలేదు. అందుకే ఆ ఇద్దరిది'అన్ హెల్త్ రిలేషన్' అని వాదన చేశాను. నేను నా మొగుడు కోసం ఏమైనా త్యాగం చేస్తాను. హౌస్ లో నుంచి బయటకి కూడా అందుకే వచ్చాను. కానీ ఆ ఇద్దరు త్యాగాలు చేసుకోలేరు. అందుకే అది అన్ హెల్త్ రిలేషన్. మాది 'ఫెయిర్ రిలేషన్'. మా అమ్మాయి డీమాన్ తో మాట్లాడకుండా చూడమని రీతూ పేరెంట్స్ కూడా నాతో చెప్పారు. భరణి, దివ్య కూడా నచ్చలేదు. కళ్యాణ్ ఆర్మీ వృత్తిని నేను విమర్శించలేదు.

మా శ్రీకాకుళం జిల్లావాడిగా బాగుండాలని అనుకున్నాను. తనూజ వెనక కళ్యాణ్ పడుతున్నాడు. తనూజ ఏమో అతన్ని వాడుకుంటుంది. ఈ విషయం బయట అందరికి కూడా అర్ధమయ్యింది.పైగా కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడు. ఆడవాళ్ళ పై చేయి వేస్తాడు. బిగ్ బాస్ కోసం ఆర్మీ ని వదిలేసాడని మాట్లాడుకుంటుంటే జాగ్రత్తలు చెప్పాను. హౌస్ లో నేను ఉన్నన్ని రోజులు ఫేమ్ కోసం తనూజ వెనక నేనేమి పడలేదని మాధురి చెప్పుకొచ్చింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.