English | Telugu
అవకాశం కావాలంటే...అమ్మాయిలు డేట్స్ కి రావాలి!
Updated : Mar 16, 2024
లంబసింగి మూవీ ద్వారా దివి, భారత్ అనే నటీ నటులు పరిచయం అయ్యారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని వీళ్ళు కలిసి చేసారు. ఐతే రీసెంట్ గా వీళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఫేక్ ఆడిషన్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు. "ఈ మధ్య కాలంలో ఫేక్ ఆడిషన్స్ చాలా జరుగుతున్నాయి. మీకు కావాల్సిన పర్సన్ ఉన్నప్పుడు ఎందుకు ఆడిషన్స్ ని ఏర్పాటుచేయడం..వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఎందుకు బాధపెట్టడం. యూట్యూబ్ వ్యూస్ తో వేరేవాళ్లను క్రష్ చేసేసి ఆ వ్యూస్ తో వచ్చే డబ్బుతో నువ్వు తినడం ఏమిటి. ఇదే సెల్ఫ్ అబ్యూజ్ కదా. అక్కడ నీ సెల్ఫ్ హానెస్టీ అని ఒకటి ఉంటుంది కదా ఈ విషయం మీద నిజంగా నిజాయితీ ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి...
ఈమధ్య స్టోరీ సిట్టింగ్స్ అని చెప్పి నటీనటులను పిలవడం వాళ్ళు కావలసినవన్నీ తినేసి, తాగేసి మా చేత బిల్స్ కట్టించడం చేస్తున్నారు. ఒక వేళ ఎదురు సమాధానం చెప్తే ఆ అమ్మాయి మంచిది కాదు రోల్ ఇవ్వొద్దు అనే మాటను స్ప్రెడ్ చేయడం ఎక్కువైపోయింది. దాంతో చాలామంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇండస్ట్రీలో రావడం లేదు. ఇక అబ్బాయిల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అంటే ఇక్కడ మమ్మల్ని వాడుకుని బిల్లు కట్టించడానికి వస్తున్నారా..అవకాశం ఇవ్వడానికి వస్తున్నారా.. అవకాశం కావాలంటే అబ్బాయిలు డబ్బులు ఎదురు ఇవ్వాలి అదే అమ్మాయిలైతే డేట్స్ కి వెళ్ళాలి. ఇలా నటీనటులు అబ్యూజ్ కి గురవుతున్నారు." అని అన్నాడు భారత్.. మనం చేసే ఏ పనైనా ఎంత సూపర్ ఫ్రెండ్ ఐనా కూడా చెప్పకూడదు. నేను అంతగా చెప్పాలి అనుకుంటే నా సీక్రెట్స్ ని నా బుక్ లో రాసుకుంటాను. నేను కవితలు, కథలు రాస్తాను. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టేవి అన్నీ నేను రాసుకున్నవే.అలా సీక్రెట్స్ ఫ్రెండ్స్ కి చెప్పి చాలా ఇబ్బందులే పడ్డాను. ఆ తర్వాత బుద్దొచ్చింది నాకు " అని చెప్పింది దివి.