English | Telugu

హిట్ అయిన డిజాస్టర్ టాస్క్!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కొత్త ఒరవడిని సంతరించుకుంటోంది. కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చేపించే టాస్క్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతూ, వస్తోంది. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో 'డిజాస్టర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ "డిజాస్టర్ టాస్క్ ఏంటి అంటే ఇంతకముందు జరిగిన టాస్క్ లో ఎవరి పర్ఫామెన్స్ తగ్గిందో వారికి డిజాస్టర్ బ్యాడ్జ్ ను ఇవ్వాలి" అని కంటెస్టెంట్స్ కి, బిగ్ బాస్ ఆదేశించాడు. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి వారి అభిప్రాయలను చెప్పి, ఒక్కొక్కరికి డిజాస్టర్ బ్యాడ్జ్ ను ఇచ్చారు. మొదట అర్జున్, రేవంత్ కి డిజాస్టర్ బ్యాడ్జ్ ఇచ్చాడు. "టాస్క్ లు అన్ని బాగా ఆడావ్. కానీ కొన్ని చోట్ల చాలా అగ్రెసివ్ బిహేవియర్ అనిపించింది. కొన్ని కొన్ని సార్లు You lost your cool and అఫెన్సివ్ లాంగ్వేజ్ యూజ్ చేసావ్. మా టీం తో చాలా ఆర్గ్ మెంట్ " అని అర్జున్ చెప్పగా, "ఓ మీ టీం అంతా అమాయకులు పాపం" అని రేవంత్ అన్నాడు. ఇలా కాసేపు వాగ్వాదం జరిగింది.

తర్వాత శ్రీసత్య, రేవంత్ కి డిజాస్టర్ బ్యాడ్జ్ ని ఇచ్చింది. కాగా శ్రీసత్య కారణాలు చెబుతూ, " బిగ్ బాస్ లో రూల్స్ కూడా ఇంపార్టెంట్ ఏ, మనం అందరం పొద్దున్న ప్లెడ్జ్ చేసేప్పుడు రూల్స్ తప్పకుండా ఫాలో అవుతాం అని చెప్పాం. ఆ తర్వాత గేమ్ లో మైక్ వేసుకోలేసని బిగ్ బాస్ లెటర్ ద్వారా చెప్పాడు. అయిన సరే నువ్వు ఫాలో అవ్వలేదు. ఇంకా చిన్న చిన్న వర్డ్స్ అన్నావ్. అది నాకు డిజాస్టర్ గా అనిపించింది " అని రేవంత్ తో, శ్రీసత్య చెప్పుకొచ్చింది. వసంతి, గీతుకి డిజాస్టర్ ఇచ్చింది. "నాకన్నా తక్కువ పర్ఫామెన్స్ గీతు ఇచ్చింది."అని నేను అనుకున్నా అని వసంతి చెప్పింది. ఆ తర్వాత మెరీనా, గీతుకి డిజాస్టర్ ఇచ్చింది. "శ్రీహాన్, ఆదిని డైవర్ట్ చేయడానికి ఆడావ్ కామెడీ చేసావ్, అక్కడ మన టీం గేమ్ స్లో అయింది." అని మెరీనా అనగా, "కానీ నేను ఆడింది కూడా గేమ్ ఏ" అని గీతు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సూర్య, వసంతికి డిసాస్టర్ ఇచ్చాడు. నువ్వు అలా కొట్టడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత వరుసగా గీతు, వసంతికి డిజాస్టర్ ఇవ్వగా, రాజ్, మెరీనా కు డిజాస్టర్ ఇచ్చాడు.

ఇలా ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కొక్కరికి డిజాస్టర్ గా చెబుతూ, కారణాలు చెప్పడం. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ గా అనిపించిందనే చెప్పాలి. చాలా మంది ప్రేక్షకులకి కంటెస్టెంట్స్ లో ఎవరు ఏం పర్ఫామెన్స్ ఇచ్చారో అని తెలిపే ఈ టాస్క్ హిట్ అయిందనే చెప్పాలి.