English | Telugu
నేను అందగత్తెనే.. నాకు సినిమా ఛాన్సులు వస్తాయి!
Updated : Oct 22, 2022
ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో అమ్మ క్యారెక్టర్ అంటే చాలు ముందుగా ఆమె గుర్తొస్తుంది. అలాంటి ప్రగతి ఇప్పుడు బుల్లి తెర మీద కూడా దుమ్ము దులుపుతోంది. సోషల్ మీడియాలో ఐతే చెప్పక్కర్లేదు.ఈమె చేసే జిమ్ వీడియోస్ కి ఫాన్స్ చాలామంది ఉన్నారు.
రీసెంట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈమె కనిపించింది ఎన్నో విషయాలను వెల్లడించింది. "నా కటౌట్ పెద్దది కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టేవాళ్లని భయపెడతాను. ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ మూవీస్ లో మాత్రమే నటిస్తా అని చెప్పా, అందుకే ఆఫర్స్ లేవు.. ఇక ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ కి తల్లిగా నటించాలంటే వాళ్లకు కాంప్లిమెంట్ కావాలి మనం. నేను ఎలా ఉన్న అందగత్తెనే.. నాకు సినిమాలు వస్తాయి." అని ఆమె చెప్పింది.
తను జిమ్ లో వర్కౌట్స్ చేసేది అందం కోసం కాదు అంటోన్న ఆమె, "నా బలాన్ని ఇంకా పెంచుకోవడానికి, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మెరుగు పరుచుకోవడానికి వర్కవుట్స్ చేస్తుంటాను.. ఇక క్యాట్ వాక్ చేస్తాను. చేతి మీద వేయించుకున్న ఈ టాటూ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా హే ఈ టాటూ చాలా బాగుంది కూల్ అంటూ ఉంటారు." అని చెప్పింది ప్రగతి. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.