English | Telugu
చిట్టి మాష్టర్ తో ఉన్న గొడవే అది.. ఢీ షోలో ఎన్నో కష్టాలు పడ్డాను!
Updated : Nov 21, 2025
బుల్లితెర మీద ఢీ షో ఎంతో ఫేమస్. అందులో రాజు, అభి, చిట్టి మాష్టర్ ఇలాంటి వాళ్లంతా కూడా ఆడియన్స్ కి పరిచయమే. అభి మాష్టర్ ఇప్పుడు ప్రసారమవుతున్న సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక వీళ్ళ కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "విజయవాడ నుంచి ఢీలో చేయడానికి 10 మందిమి వచ్చాము. తర్వాత ఒక్కొక్కరిగా అందరూ వెళ్లిపోయారు. చివరికి నేనొక్కడినే మిగిలాను. ఇక స్కూల్ కూడా మానేసి ఢీ షోలోనే ఉండిపోయాను. సాయి తేజ అన్న దగ్గర నుంచి చిట్టి అన్న దగ్గరకు వచ్చేసాం. ఇక ఆయన్ని మాష్టర్ ని చేయడం కోసం చాలా కష్టపడ్డాం. ఢీ జూనియర్స్ 2 నుంచి నేను నెమ్మదిగా కోరియోగ్రఫీ చేయడం స్టార్ట్ చేసాను.
సాంగ్స్ ఎడిటింగ్ అవీ నేర్చుకున్నా. నేను చిట్టి అన్న, చైతన్య అన్నా కలిసాం. అలా ఢీ జోడి ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాము. ఢీ జోడికి సోమేష్ కంటెస్టెంట్ నేను మాస్టర్ అని ఫిక్స్ ఐపోయాం. నేను విజయవాడ వచ్చేసాను. ఐతే చిట్టి అన్న నాకు ఫోన్ చేయడం మానేసాడు. ఫైనల్ గా షూటింగ్ డేట్ రేపు అనగా ముందు రోజు ఫోన్ చేసి నువ్వింకా చిన్నపిల్లోడివే మిగతా వాళ్ళు నువ్వు ఇవన్నీ హ్యాండిల్ చేయలేవు అని చెప్పారు అన్నాడు. అప్పుడు ఆయన మీద నాకు బాగా కోపం వచ్చింది. వాళ్ళు చెప్పకపోయినా చిట్టి అన్నే చెప్పాడు అనుకున్నా. అప్పుడు కోపంతో డాన్స్ చేయడం మానేద్దామనుకున్నా. ఆ సీజన్ లో చైతన్య మాష్టర్ కి కూడా ఛాన్స్ వచ్చింది. ఐతే అతని దగ్గర అసిస్టెంట్ లేదు. అప్పుడు నన్ను తన దగ్గరకు వచ్చేయమని చెప్పాడు. అలా తర్వాత ఢీ 10 వచ్చింది. రాజు ఎంటరయ్యాడు. అతనికి ఉన్నంత డెడికేషన్ ఇంకెవరి దగ్గరా నేను చూడలేదు. ఆ తర్వాత ఫైనల్ గా టైటిల్ కొట్టాం. ఇక వాళ్ళు చార్జెస్ కి మాత్రమే డబ్బులు ఇస్తారు. తినడానికి డబ్బులు లేవు. సెలబ్రేషన్ చేసుకోవడానికి కనీసం బిర్యానీ కూడా లేదే అనుకున్నాం. అప్పుడు 5 రూపాయలకే భోజనం అన్న చోట లైన్ లో నిలబడి భోజనం చేసాం. అప్పటికే మా చెప్పులు ఎవరో తీసుకెళ్లిపోయారు. వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు.