English | Telugu

Illu illalu pillalu : అమూల్యపై వేదవతికి డౌట్.. కవర్ చేసిన శ్రీవల్లి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -322 లో.....సాగర్ రైస్ బ్యాగ్ లు షాప్ లో వేస్తాడు. అప్పుడే నర్మద వాళ్ళ నాన్న వచ్చి నీకు ఇదే పని కరెక్ట్ నీకు గవర్నమెంట్ జాబ్ రాదు.. జాబ్ రాలేదని పేపర్ తన మొహంపై కొట్టి వెళ్తుంటే నర్మద వస్తుంది. సాగర్ ని చూసి బాధపడుతుంది. మరొకవైపు అమూల్య, విశ్వ బండిపై వెళ్తున్నది వేదవతి గుర్తుచేసుకుంటుంది. ఇక అదే సమయంలో పాలు పొంగిపోతున్నా పట్టించుకోదు.. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటి అత్త అంత ఏం ఆలోచిస్తున్నావని అంటుంది.

అమూల్య మీ అన్నయ్య బైక్ పై వెళ్ళడం నేను చూసానని వేదవతి అంటుంది. అలా ఏం జరగదు మా అన్నయ్యతో అమూల్య అసలు మాట్లాడదని ప్రేమ అంటుంది. లేదు ప్రొద్దున అమూల్య వేసుకున్న డ్రెస్.. నేను చూసిన అమ్మాయి డ్రెస్ సేమ్ అని వేదవతి అంటుంది. అదంతా శ్రీవల్లి వింటుంది. అమూల్య రావడం చూసి పక్కకి పిలిచి నిన్ను మీ అమ్మ చూసిందట కానీ డౌట్ లో ఉంది. ఈ చున్నీ చేంజ్ చేసుకోమని శ్రీవల్లి ఇస్తుంది. చున్నీ చేంజ్ చేసుకొని అమూల్య వస్తుంటే వేదవతి చూసి ప్రొద్దున ఈ చున్నీ కాదు కదా అని అడుగుతుంది. ఇదే చున్నీ అని అమూల్య చెప్తుంది. నిన్ను విశ్వ బైక్ పై చూసానని వేదవతి అడుగగా వాడితో అసలు మాట్లాడాను నేను అని చెప్తుంది. శ్రీవల్లి వచ్చి కవర్ చేసి అమూల్యని లోపలికి పంపిస్తుంది.

లోపలికి వెళ్ళాక విషయం చాలా దూరం వెళ్లినట్లు ఉందని శ్రీవల్లి అనగానే అమూల్య సిగ్గుపడుతుంది. మరొకవైపు సాగర్ జాబ్ రాలేదని డిస్సపాయింట్ అవుతుంటే నర్మద మోటివేట్ చేస్తుంది. అదంతా శ్రీవల్లి విని అమ్మో మావయ్యకి తెలియకుండా ఇదంతా చేస్తున్నారా.. ఈ విషయం మావయ్యతో చెప్పాలి కానీ సాక్ష్యం కావాలని శ్రీవల్లి అనుకుటుంది. వాళ్ళ గదిలోకి వెళ్లి హాల్ టికెట్ వెతుకుతుంది. శ్రీవల్లికి హల్ టికెట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.