English | Telugu

ఢీ-14 టైటిల్ విన్నర్ జతిన్...కొరియోగ్రాఫర్ రామ్ కి మంచి ఆఫర్ ఇచ్చిన రవితేజ!

ఢీ 14 సీజన్ కి ది ఎండ్ కార్డు పడింది. ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి సాగర్ - రిషిక, జతిన్ ఎంపికయ్యారు. ఇక ఫైనల్ రౌండ్ లో జతిన్ ఢీ-14 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. సాగర్-రిషిక రన్నరప్ గా నిలిచారు.

ఇక జతిన్ కి 75 లక్షల క్యాష్ ప్రైజ్ ని, టైటిల్ ని రవితేజ అందించారు. రవితేజ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు చెప్పారు. ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ అయ్యి కాస్త ఎమోషనల్ గా ఎండ్ అయ్యిందని అన్నారు. విన్నర్స్ ని అనౌన్స్ చేసినప్పుడు రవితేజ చాలా టెన్షన్ పడ్డారు. ఇక ఇదే విషయాన్ని హైపర్ ఆది కూడా స్టేజి మీద చెప్పాడు.

ఇక రవితేజ జతిన్ కొరియోగ్రాఫేర్ కి అద్దిరిపోయే ఆఫర్ ని ఈ గ్రాండ్ ఫినాలే స్టేజి మీద అనౌన్స్ చేశారు. జతిన్ కి కోరియోగ్రఫీ చేసిన రామ్ మాస్టర్ ని హగ్ చేసుకుని త్వరలో మనం కలిసి ఒక సాంగ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ మాటతో రామ్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇలా ఈ షో ముగిసింది. ఇక ఈ షో హోస్ట్ ప్రదీప్ ఈ షోకి ఎండింగ్ లో నెక్స్ట్ వీక్ ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్ రౌండ్ లో కలుద్దాం అని అందరికీ సెండాఫ్ ఇచ్చేసాడు.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.