English | Telugu

ఎంటర్టైన్మెంట్, ఎనెర్జీ అనే పదాలకు రూపముంటే దాని పేరే రవితేజ!

ఢీ-14 గ్రాండ్ ఫినాలేకి మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేశారు. ఇక రవితేజ గురించి హైపర్ ఆది ఒక రేంజ్ లో చెప్పి ఔరా అనిపించుకున్నాడు. " మీ కెరీర్ స్టార్టింగ్ లో ఆ చేతులు అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టాయి. ఇప్పుడు మీ కెరీర్ చూసి మా చేతులు క్లాప్స్ కొడుతున్నాయి, కొడుతూనే ఉంటాయి. అల్లరి ప్రియుడు మూవీలో హీరోకి ఎక్కడో బాక్గ్రౌండ్ లో ఉన్నారు.

తర్వాత ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చారు. కాలేజీ ఎగ్గొట్టి వేరే వాళ్ళ సినిమాకు మీరు వెళ్లే స్థాయి నుంచి మేము కాలేజీ ఎగ్గొట్టి మీ సినిమా చూసే స్థాయి వరకు మీ జర్నీ సూపర్. హీరో ఐన పదేళ్లకు మీకు కిక్కు వస్తే మాకు మీరు హీరో ఐనప్పుడే కిక్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ , ఎనెర్జీ అనే పదాలకు రూపం ఉంటే ఆ రూపానికి కచ్చితంగా రవితేజా అనే పేరే పెడతాను. ఇండస్ట్రీ ప్రతీ హీరోకి వేరే హీరో కాంపిటీషన్ ఉంటారు. కానీ మీకు మీరే కాంపిటీషన్. ఎందుకంటే రవితేజ అన్న పేరులో రన్నర్ మీరే, విన్నర్ మీరే..ఇండస్ట్రీ మొత్తం రాజా ది గ్రేట్ అంటుందేమో మాలాంటి ఫాన్స్ అంతా మాత్రం రవితేజ ది గ్రేట్ అంటాము. మీ సినిమా చూసేటప్పుడు మా మూతి మీద చిరునవ్వు ఉంటది, సినిమా చూసి బయటికి వచ్చాక మా చెయ్యి మా మీసం మీద ఉంటది. వెంకీ, దుబాయ్ శీను మీకు బ్లాక్ బస్టర్స్ ఐతే మాకు స్ట్రెస్ బస్టర్స్..మీరు ఎంత డబ్బు సంపాదించారో తెలీదు కానీ ఇప్పటికీ మీమర్స్ వాటిని క్రియేట్ చేసుకుని కాష్ చేసుకుంటున్నారు. ఇంకా వెనకే ఉండి డాన్స్ చేస్తున్నాం అని ఫీల్ అవుతున్న వారందరికీ ఒకటే చెప్తున్నా కర్తవ్యం మూవీలో రవితేజ గారు కనబడపడకుండా వెనకే ఉండేవారు.

తర్వాత కష్టపడి పనిచేసి ఇలా మాస్ మహారాజ రవితేజ అయ్యారు. ఆయన గురించి చెప్పాలంటే అవతల వాడిని నమ్ముకుంటే ఆరిపోతాయి, పక్కవాడిని నమ్ముకుంటే పారిపోతావ్, ముందు వాడిని నమ్ముకుంటే మునిగిపోతావు, వెనకవాడిని నమ్ముకుంటే వెనక్కి పోతావ్..మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఆయన సిద్ధాంతం. ఆయనకు సలహాలు ఇచ్చే అలవాటు లేదు, తీసుకునే అవసరం కూడా లేదు..అందుకే ఇండస్ట్రీలో ఆయనకు తిరుగు లేదు..." అని రవితేజ గురించి ఆయన చరిత్ర మొత్తం ఆది స్టేజి మీద చెప్పుకొచ్చాడు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.