English | Telugu

అడ్డంగా బుక్కైన దీప్తి సున‌య‌న‌!

బిగ్‌బాస్ స్టేజ్‌పై ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ప్రియురాలు దీప్తి సున‌య‌న క‌నిపించి ర‌చ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ముందు షన్ను కోసం అత‌ని బ్ర‌ద‌ర్ రాండంతో కొంత నిరాశ చెందిన ష‌న్ను ఆ త‌రువాత దీప్తి ఎంట్రీ ఇచ్చేసే స‌రికి అంతులేని ఆనందంతో ఎగిరి గెంతులేశాడు. దీప్తిని స్టేజ్‌పై చూసిన త‌రువాత ష‌న్నులో ఎక్క‌డ‌లేని కొత్త ఉత్సాహం క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా దీప్తి సున‌య‌న బిగ్‌బాస్ స్టేజ్‌పై చేసిన ర‌చ్చ‌పై సోష‌ల్ మీడియాలో భీభ‌త్స‌మైన ట్రోలింగ్ న‌డుస్తోంది.

దీప్తి సున‌య‌న స్టేజ్‌పై ప‌క్క‌న నాగ్ స‌ర్‌తో పాటు ష‌న్ను బ్ర‌ద‌ర్ వుండ‌గానే త‌న యాటిట్యూడ్‌ని చూపించింద‌ని, అంతే కాకుండా ష‌న్నుని త‌ప్ప హౌస్‌లో వున్న‌ మిగ‌తా కంటెస్టెంట్‌ల ముఖాల‌ని కూడా చూడ‌లేద‌ని ఓ రేంజ్‌లో దీప్తిని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా కోట్లాది మంది ప్రేక్ష‌కులు చూస్తుండ‌గా దీప్తి ష‌న్నుకి ఏఓ సిగ్న‌ల్స్ ఇచ్చింద‌ని విమ‌ర్శలు మొద‌ల‌య్యాయి. దీంతో రంగంలోకి దిగిన దీప్తి వివర‌ణ ఇచ్చింది. ఇన్‌స్టా వేదిక ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది.

`నేను చాలా మాట్లాడుదాం.. అంద‌రికి చాలా చెబుదాం అనుకున్నా..టీమ్ ప్రెష‌ర్ వ‌ల్ల తొంద‌ర‌గా మాట్లాడి వ‌చ్చా. లాస్ట్‌లో వెళ్లా క‌దా టైమ్ కూడా లేకుండే. నేను స్టేజ్ ఒదిలివెళ్లాక గుర్తొచ్చింది నేను ఎవ‌రితోనూ మాట్లాడ‌లేద‌ని. ష‌న్నుతో మాట్లాడుతూ అస‌లు మ‌ర్చిపోయా. అక్క‌డ చెప్ప‌డం మ‌ర్చిపోయి ఉప్పుడు చెబుతున్నా.. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వ‌న్‌. నాది యాటిట్యూడ్ కాదు మ‌ర్చిపోయా. పోయిపోయి అక్క‌డే చూయిస్తానా యాటిట్యూడ్‌` అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది దీప్తి సున‌య‌న‌.