English | Telugu
BiggBoss 7 Nominations : SPY వర్సెస్ SPA.. ఇది తీరని పగ!
Updated : Nov 28, 2023
బిగ్ బాస్ సీజన్-7 పూర్తి అవ్వడానికి మరికొన్ని వారాల ఉండటంతో ఆసక్తిగా మారుతుంది. అయితే ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తిచేసుకుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ తో రతిక, అశ్వినిశ్రీ ఎలిమినేట్ అయ్యారు.
పదమూడవ వారం ఎమిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. వీరిమధ్య సోమవారం జరిగిన నామినేషన్ ల ప్రక్రియలో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఈ వారం హౌస్ నుండి ఎవరిని బయటకు పంపించాలనుకుంటున్నారో తగిన కారణం చెప్పి వారికి రంగు పూయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా... మొదట శోభాశెట్టిని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. వీఐపీ రూమ్ లోని బ్లాంకెట్ ని నువ్వు దోచుకున్నావ్.
కానీ అక్కడ బ్లాంకెట్ లేక మేము చలిలో పడుకున్నామని శోభాశెట్టితో పల్లవి ప్రశాంత్ చెప్పి నామినేట్ చేశాడు. ప్రియాంక జైన్ ని పల్లవి ప్రశాంత్ రెండవ నామినేషన్ చేశాడు. మెన్నటి వారం టాస్క్ లో అందరు గేమ్ ఆడుతుంటే... మీరు శోభాకి క్లూ చెప్పేసి వీఐపీ బాత్ రూమ్ కి వెళ్ళమని చెప్పారు. మీరు కెప్టెన్ అయ్యి ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నాకు అది నచ్చలేదని నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్.
ఆ తర్వాత అమర్ దీప్ నామినేట్ చేయడానికి వచ్చి.. మొదటి నామినేషన్ గా పల్లవి ప్రశాంత్ ని, రెండవ నామినేషన్ గా గౌతమ్ ని చేశాడు. ఆ రోజు టాస్క్ లో నువ్వు శివాజీ అన్న చెప్పగానే స్టోర్ రూమ్ లోకి వెళ్ళావ్. ఆ తర్వాత మొక్క పోయింది దానివల్ల ఆ టాస్క్ లో నువ్వు తొందరగా డెడ్ అయ్యావ్.అలా కాకుంటే నీ గేమ్ ఇంకా ముందుకు వెళ్ళేదని నేను అనుకున్నాను. అదొక్కడే రీజన్ అని చెప్పి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు అమర్ దీప్. మొన్నటి కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ముందు వెళ్ళినప్పుడు.. అర్జున్ ఫోటో వచ్చినప్పుడు తన ఫోటో కాల్చేస్తే ఆ తర్వాత నేను ఈజీగా గెలిచేవాడిని.
కానీ నువ్వు అర్జున్ ను కాల్చకుండా చివరి వరకు తీసుకొచ్చావ్. నువ్వు నా గురించి స్టాండ్ తీసుకుంటే ఆ చివరి దాంట్లో అంత ఆర్గుమెంట్ జరిగేది కాదని అమర్ దీప్ అనగానే.. నాకు నీకంటే అర్జున్ అన్ననే కాస్త ఎక్కువ బెటర్ అనిపించింది. నీతో కంపేర్ చేస్తే అర్జున్ అన్న మీదే గ్రాట్రిట్యూడ్ ఎక్కువ. ఎందుకంటే నీ వల్ల నా గేమ్ ముందుకు వెళ్ళలేదు. అర్జున్ అన్న నాకు బాగా చెప్పాడు. అందుకే అర్జున్ అన్న వైపు ఉన్నానని గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు. ఇక అది నచ్చలేదని గౌతమ్ ని అమర్ దీప్ నామినేట్ చేశాడు.
