English | Telugu

అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్.. శివాజీనే టార్గెట్!


బిగ్ బాస్ సీజన్-7 తుదిదశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఇక పన్నెండవ వారం రతిక, అశ్వినిశ్రీ ఇద్దరు ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక పదమూడవ వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర స్థాయిలో జరిగింది.

గతవారం వీకెండ్ లో.. చుక్క బ్యాచ్, మొక్క బ్యాచ్, తొక్క బ్యాచ్ అని నాగార్జున విభజించిన విషయం తెలిసిందే. ఇక దీన్నే సీరియస్ గా తీసుకొని ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్, యావర్ లని శోభాశెట్టి నామినేట్ చేసింది. శివాజీ, పల్లవి ప్రశాంత్ లని ప్రియాంక నామినేట్ చేసింది. శివాజీ, ప్రియాంకని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్ లని గౌతమ్ నామినేట్ చేశాడు. పల్లవి ప్రశాంత్, గౌతమ్ లని అమర్ దీప్ నామినేట్ చేశాడు.

అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలని శివాజీ నామినేట్ చేశాడు. " పన్నెండు వారాలు అయ్యిపోయాయి. ఇకనైన గ్రూపిజం, ఫేవరిజం వద్దు. ఫ్రెండ్స్ అయితే బయటకు పోయాక సపోర్ట్ చేసుకోండి. ఇకనైన ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడండి" అని ప్రియాంకని నామినేట్ చేశాడు అంబటి అర్జున్. "వారం మొత్తం గెలిచిన, మనవల్ల ఒక్క తప్పు జరిగిన అదంతా బయట వేరేలా కన్పిస్తుంది. పప్పీ కోసం మీరు నిలబడ్డారు కానీ అక్కడ ఇద్దరి సిచువేషన్ కంపేర్ చేస్తే బాగుండు. అలా జరుగుతుంద‌ని అనుకోలేదు " అని చెప్పి శివాజీని నామినేట్ చేశాడు అర్జున్.

మొన్నటి గేమ్ లో అందరికన్నా సేఫ్ గా ఆడింది పల్లవి ప్రశాంత్ అని నాకు అనిపంచింది అందుకే నామినేట్ చేస్తున్నా అని శోభాశెట్టి అంది. శోభా.. యువర్ గేమ్ ఈజ్ ఫినిష్ అని బాత్ రూమ్ లో నా పేరు రాశావ్ అది నాకు నచ్చలేదని చెప్పి యావర్ ని శోభాశెట్టి నామినేట్ చేసింది. " తెలిసిన మిత్రుడి కంటే తెలియని శత్రువు బెటర్ అని ఆ రోజు నువ్వు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇక అనవరం. నేను నిన్ను ఇప్పటికి ఒక ఫ్రెంఢ్ గానే చూసాను. నువ్వు ఒక గేమర్ లా ఆలోచించావని ఇప్పుడే తెలిసింది. ఆ రోజు అమర్ దీప్ కి శోభాశెట్టి సపోర్ట్ గా, నీకు నేను సపోర్ట్ గా ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు నువ్వు చెప్పినా నేను నీకు సపోర్ట్ చేసేవాడిని కాదు. అలా నువ్వు చేయలేదు. అది నీ స్ట్రాటజీ అని ఇప్పుడే తెలిసింది " అని చెప్పి అర్జున్ ని నామినేట్ చేశాడు శివాజీ‌.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.