English | Telugu

'గాడ్ ఫాదర్' సాంగ్స్ విషయంలో బాధపడిన తమన్

తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేశారు నిర్వాహకులు. దేశవ్యాప్తంగా ఈ షోకి మంచి హైప్ వచ్చింది. రేటింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. వాగ్దేవి, వైష్ణవి, జయంత్, శ్రీనివాస్, ప్రణతి ఫైనల్స్ కి చేరుకున్న విషయం తెలిసిందే. లాలస ఎలిమినేట్ అయ్యింది. ఓటిటి వేదికగా స్టార్ట్ ఐన ఈ షోకి మంచి ఆదరణ లభించడంతో పాటు కొత్త గొంతులు కూడా సంగీత ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇంతటి సక్సెస్ఫుల్ షో ఫైనల్ ఎపిసోడ్ కి బాస్ చిరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ షోకి అదనపు ఆకర్షణగా 'విరాటపర్వం' జోడీ రానా, సాయిపల్లవి కూడా వచ్చి స్టేజిని మరింత ఎనర్జిటిగ్గా మార్చబోతున్నారు. తెలుగులో ఇదే ఫస్ట్ ఇండియన్ ఐడల్ షో కావడంతో ఎవరు విన్నర్ అవుతారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ జూన్ 17న ప్రసారం కాబోతోంది. ఇక ఇదే రోజు 'విరాటపర్వం' మూవీ రిలీజ్ అవబోతోంది. ఇప్పుడు చిరంజీవి వస్తున్న ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

జడ్జ్‌ ఐన నిత్యామీనన్ షోకి రెడీ అవుతూ "లేటవుతుంది, నా ఇయర్ రింగ్స్" అంటూ అడుగుతూ ఉంటుంది. "గాడ్ ఫాదర్ సాంగ్స్ అడిగితే ఏం చేయాలి?" అంటూ టెన్షన్ పడుతున్నట్టుగా థమన్, "ఇక ఈ రోజు నేను కొంచెం ఎక్సయిటెడ్, కొంచెం నెర్వస్ గా ఉన్నాను" అంటూ కార్తిక్ చెప్తున్నట్టుగా ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. బ్యాగ్రౌండ్‌లో ఒక పాప పరిగెడుతూ "మన మెగాస్టార్ వచ్చేస్తున్నారో" అంటూ చెప్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.