English | Telugu
'అన్‌స్టాపబుల్ 2' చంద్రబాబు ఎంట్రీతో శుభారంభం!
Updated : Oct 6, 2022
అభిమానుల గుండెల్లోకి మళ్ళీ ఒకసారి దూసుకెళ్లిపోవడానికి బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 2 తో రెడీ ఐపోయారు. దీనికి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఆల్రెడీ సీజన్ 1 లో అద్భుతంగా హోస్ట్ చేసి షోకి వేరే లెవెల్ కి తీసుకెళ్ళేసరికి సీజన్ 2 ని కూడా అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేసింది ఆహా.
ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని విజయవాడలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ని పొలిటికల్ ఎంట్రీతో మొదలుపెట్టబోతున్నారు. దీని కోసం ఈ షోకి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చారు. వీళ్లకు సంబందించిన షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బావ బామ్మర్దుల మధ్య ఎలాంటి ప్రశ్నలు పేలాయో ఎలాంటి జవాబులు వచ్చాయో అని ఆడియన్స్, ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పొలిటికల్ గా ఇంక ఎవరు వస్తున్నారు అని మీడియా అడిగేసరికి ఇంకా ఎవరూ రారని చెప్పారు బాలయ్య. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా కూడా ఈ షోకి వస్తారని చెప్పారు బాలయ్య .