English | Telugu

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్మాల్ స్క్రీన్ స్టార్స్..షో పైకి లేస్తుందా ?

బిగ్ బాస్ సీజన్ 6 భయంకరమైన బోర్ కొట్టిస్తోంది ఆడియన్స్ కి. ముందు హోస్ట్ ని మార్చేస్తే చాలా బెటర్ అనుకుంటున్నారు బిగ్ బాస్ ఫాన్స్. కింగ్ హోస్టింగ్ సప్పగా ఉండడం వలన టీఆర్పి రేటింగ్ కూడా పడిపోతోంది. స్టార్టింగ్ సీజన్స్ లో జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి వాళ్ళు చేసినప్పుడు ఎంత రేటింగ్ వచ్చేదో అందరికీ తెలుసు. కింగ్ ని రీప్లేస్ చేసి వాళ్ళతో షో నడిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన ఐదు సీజన్ల టీఆర్పీ పెద్ద ఆశాజనకంగా లేదు.

ఇక ఈ సీజన్ 6 గురించి చెప్పనే అక్కరలేదు. ఈ సీజన్ మీద సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ కూడా ఎక్కువైపోయింది. అందుకే షోని మధ్యలో ఆపేయలేక హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెడుతూ యాజమాన్యం ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. కానీ వర్కౌట్ కావట్లేదు అని అర్ధం చేసుకుని మరో ప్లాన్ ని లైన్ లో పెట్టడానికి రెడీ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీని అడ్డం పెట్టుకుని ఫేమస్ స్మాల్ స్క్రీన్ స్టార్స్ ని హౌస్ లోకి పంపించి ఎంటర్టైన్ చేయించడానికి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవకముందు కొంతమందిని సంప్రదించినట్టుగా పేర్లు వినిపించాయి కానీ వాళ్ళు మాత్రం హౌస్ లో కనిపించలేదు.

ఈ వైల్డ్ కార్డు ఎంట్రీతో అప్పుడు సంప్రదించిన వాళ్లందరినీ ఇప్పుడు తేవడానికి భారీగానే ఎత్తుగడ వేస్తున్నారనిపిస్తోంది. ఈ వైల్డ్ కార్డు ద్వారా బుల్లి తెర జబర్దస్త్ స్టార్స్ ఐన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ఎంట్రీ ఇచ్చి అలరించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సుధీర్, ఆది ప్రూవెన్ ఆర్టిస్టులు, బిజీ ఆర్టిస్టులు కూడా.. మరి బిగ్ బాస్ ని గొడవలతో, కొట్లాటలతో పైకి లేపలేక అవస్థలు పడుతున్నారు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వీళ్ళను పంపించి షోని ఏ రేంజ్ కి తీసుకెళ్తారో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.