English | Telugu
చంద్ర, సుధీర్ తిరిగి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ...? గెటప్ శీను హాట్ కామెంట్స్!
Updated : Oct 6, 2022
పాన్ ఇండియా లెవల్లో చిరు నటించిన గాడ్ ఫాదర్ మూవీ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా గెటప్ శీను చిరుతో కలిసి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ చేయడం, ఆయనతో కలిసి భోజనం చేయడం వీటిని శీను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసాడు. తన అభిమాన నటుడితో ఇలా కలిసి ప్రయాణించడం గొప్ప అనుభూతి అని చెప్పాడు.
అలాగే ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుతో తన జర్నీ గురించి అలాగే జబర్దస్త్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు గెటప్ శీను. అలాగే ఒక బౌల్ లో జబర్దస్త్ కమెడియన్స్ నేమ్స్ చిట్టీలుగా వేసి తీయించాడు యాంకర్. చమ్మక్ చంద్ర పేరు వచ్చేసరికి "ఆయన్ని చాలా మిస్ అవుతున్నా... ఎంతో డెడికేటెడ్ పర్సన్..ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎన్ని సార్లైనా రిహార్సల్స్ చేసి ఆ స్కిట్ ని పెర్ఫార్మ్ చేస్తాడు. తిరిగి మళ్ళీ జబర్డస్త్ కి వచ్చేస్తే బాగుంటుంది..వచేస్తాడేమో అనిపిస్తోంది" అన్నాడు గెటప్ శీను.
తర్వాత సుధీర్ పేరు లిస్ట్ వచ్చేసరికి. "నాలుగు షోలు చేసిన కింగ్ వాడు. జబర్దస్త్ కి సుధీర్ తిరిగి వచ్చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఒకప్పుడు రాంప్రసాద్ కి మేం దూరమైతే ఎలా బాధపడ్డాడో ఈరోజు నేను రాంప్రసాద్ సుధీర్ లేకపోవడంతో అంతే బాధగా ఉన్నాం...జబర్దస్త్ కి తిరిగి వచేస్తాడనిపిస్తోంది. ఎందుకంటే సుధీర్ చైర్ అలాగే ఖాళీగా ఉంది" అని చెప్పాడు.