English | Telugu
బిబి బాబా, పది మంది దొంగలు.. కెప్టెన్సీ టాస్క్ లో గెలుపెవరిది!
Updated : Oct 4, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి క్రేజ్ క్రియేట్ చేస్తుంది. హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్స్ తమ ఇండివిడ్యువల్ గేమ్ ని ఆడాలని బిగ్ బాస్ ఓ ఆటని ఇస్తే అందులో సిల్లీ రీజన్స్ తో సీరియల్ బ్యాచ్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ తప్పుగా ఆడుతున్నారు.
ఇప్పటివరకు హౌజ్ మేట్స్ గా ఉన్న ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. అయితే మంగళవారం నాటి ఎపిసోడ్ లో .. వాళ్ళ ముగ్గురి పవరస్త్రాలని తీసుకున్నాడు బిగ్ బాస్. ఇక వీటిని సగర్వంగా సమర్పించాలని బిగ్ బాస్ కోరగా.. జగమే మాయ పవరస్త్రానే పాయే అంటు శివాజీ పాట పాడాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. ఇక అందరూ సంతాపం ఎందుకు తెలియజేస్తున్నారు పాట పాడండని శివాజీ అనగా.. మీ పాట కూడా సంతాపం లాగే ఉందని అమర్ దీప్ అన్నాడు. ఇక ఆ తర్వాత ఎయ్ ఎయ్ రో సూత్తావేయ్ రో అంటు మరో పాట పాడాడు శివాజీ. ఇక అక్కడ హౌజ్ మేట్స్ గా ఉన్న ఆట సందీప్, ప్రశాంత్ లని చూసిన శివాజీ పాట ఆపేసి మాములు అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరు ఇక హౌజ్ మేట్స్ అని చెప్పాడు. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. మీ బడ్డీలని మీరే నిర్ణయించుకొని బిగ్ బాస్ చెప్పమన్నాడు. కాసేపటికి అమర్ దీప్-ఆట సందీప్, ప్రియాంక-శోభా శెట్టి, యావర్-టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ శుభశ్రీ, పల్లవి ప్రశాంత్- శివాజీ లుగా తమ బడ్డీలని ఎంచుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్ గా మొదటి టాస్క్ 'గెలిపించేది మీ నవ్వే' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.
ఒక లిప్ సింబల్ ఉన్న భాగం అక్కడ ఉంటుంది. ఇక ఆ లిప్ ని ఫిల్ చేయడానికి టీత్ ని తీసుకొచ్చి అమర్చాలి. అది ఎలా వెళ్ళాలంటే.. జిగురుగా ఉన్న నీరు, మట్టి నీరుని దాటి వెళ్ళి పాండ్ లో ఉన్న టీత్ ని తీసుకొచ్చి అమర్చాలి. అయితే ఒక కంటెస్టెంట్ టీత్ తీసుకొచ్చి లిప్స్ లో అమర్చిన తర్వాతే అతని బడ్డీ వెళ్ళాలని, అన్ని పూర్తి చేసిన తర్వాత బెల్ కొట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ కి యావర్, శోభా శెట్టీలని సంచాలకులని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాస్క్ మొదలైంది. పల్లవి ప్రశాంత్ అందరి కన్నా స్పీడ్ గా పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ టీత్ ని మొదట తీసుకొని వచ్చి పెట్టాడు. ఇక శివాజీ కూడా పడుతు, లేస్తూ రెండు సార్లు కిందపడినా మళ్ళీ లేచి వెళ్ళి ఆ టీత్ తీసుకొచ్చాడు. పోరాట పటిమని చూపించాడు శివాజీ. ఇక మొదట టాస్క్ ఫినిష్ చేసి బెల్ కొట్టారు శివాజీ-ప్రశాంత్. ఆ తర్వాత అమర్ దీప్- ఆట సందీప్, గౌతమ్ కృష్ణ- శుభశ్రీ, ప్రియాంక-శోభా శెట్టి, చివరగా టేస్టీ తేజ- యావర్ లు టాస్క్ ఫినిష్ చేశారు. మరి వీళ్ళలో గెలుపెవరిదనేది సంచాలకులకి డౌట్ ఉంది. రెండు సార్లు బిగ్ బాస్ ఎవరు ఫస్ట్ వచ్చారని చెప్పమనగా యావర్-శోభా శెట్టిలు చెప్పలేకపోయారు.
