English | Telugu

తొమ్మిదేళ్ల లవ్ ట్రాక్ వాళ్ళది...


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఒక అపార్ట్మెంట్ లో ఉండే ఆంటీస్ వెర్సెస్ అంకుల్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ షోని ప్లాన్ చేశారు. ఇందులో ప్రీతినిగమ్ తన భర్త నగేష్ తో, శ్రీవాణి తన భర్త విక్రమ్ తో, అంజలి తన భర్త పవన్ తో అలాగే దొరబాబు తన వైఫ్ తో ఈ షోకి వచ్చారు. వీళ్లంతా రొమాంటిక్ సాంగ్స్ కు స్టెప్పులేసి మంచిగా ఎంటర్టైన్ చేశారు. ఇది చూసిన రష్మి కాస్త సిగ్గుపడుతున్నట్టుగా ఫీలయ్యింది. ఇక షోకు వచ్చిన అంజలి పవన్ జోడిని చూసి "పెళ్ళై ఎన్ని సంవత్సరాలు" అని అడిగింది ' పెళ్లై 9 ఏళ్లు అవుతోంది" అని అంజలి చెప్పింది.. తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఆ..ఆ..నాట్ బాడ్ " అంటూ రష్మి కొంచెం రొమాంటిక్ వాయిస్ తో చెప్పేసరికి..దానికి రాంప్రసాద్ మధ్యలో వచ్చి "మీలాగా నైన్ ఇయర్స్ ట్రాక్ కాదు వాళ్ళది..మ్యారేజి" అని రష్మి మీద సెటైర్స్ వేసాడు.

దానికి రష్మీ ఓ రేంజ్ లో రాంప్రసాద్ ని చూసింది. ఇక తర్వాత రాంప్రసాద్, విక్రమ్, గడ్డం నవీన్, తాగుబోతు రమేష్ వంటి వాళ్లంతా డిజె తిళ్ళు టైటిల్ సాంగ్ కి జిగేల్ మనిపించే డ్రెస్సులు వేసుకొచ్చి స్టైలిష్ డాన్స్ చేసి అదరగొట్టారు. ఇక ఇంద్రజ ఫుల్ కుష్ ఐపోయింది. ఇది కదా అసలైన దావత్ అని గట్టిగా అరిచింది. తర్వాత ఆంటీలంతా రంగురంగుల చీరలు కట్టుకొచ్చి సీతాకోకల్లా మంచి రొమాంటిక్ సాంగ్స్ కి హాట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇక వాళ్ళ డాన్సులు చూసిన రష్మీ "అక్కడ కూర్చున్న అంకుల్స్ అందరికీ దసరా పండగే" అని కామెంట్ చేసింది. ఫైనల్ గా ఫిట్నెస్ టెస్ట్ పెట్టింది. థ్రెడ్ మిల్ తెప్పించి నడిపించింది. ఫిట్ నెస్ బట్టి తెలిసిపోతుంది మీరు అంకుల్స్ ఆ , ఆంటీస్ ఆ అని చెప్పింది రష్మీ . జబర్దస్త్ లో చేసిన సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ గురించి అందరికీ తెలుసు. వీళ్ళ ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు కూడా. ఐతే ఇప్పుడు సుధీర్ సినిమాల్లో అవకాశాలు రావడంతో వెళ్ళిపోయాడు. దీంతో రష్మి ఒంటరిగా ఉండిపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.