Read more!

English | Telugu

ఖుష్బూ పేరు ఎలా వచ్చిందో చెప్పిన భాస్కర్...గోడ దూకేసిన సుధీర్ పై కామెంట్స్

ఎక్స్ట్రా జబర్దస్త్ 450 ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్, సత్య చేసిన స్కిట్ చాలా నవ్వు తెప్పించింది. "విరిసినది వసంత గానం" అనే సాంగ్ ని పాడుకుంటూ రాజు,రాణి గెటప్స్ లో వచ్చారు. ఐతే రష్మీ కూర్చుని ఆసక్తిగా చూస్తూ ఉంది..సాంగ్ ఐపోయాక సత్య రష్మిని చూపిస్తూ "మానవా అక్కడున్న పక్షి ఎవరు" అని అడిగేసరికి "అది పక్షి కాదు దాన్ని చిలకమ్మా అందురు" అని భాస్కర్ చెప్పాడు. "ఐతే పక్కన గోరింకా ఉండాలిగా..ఎక్కడికెళ్లింది" అని సత్య అనుమానంగా అడిగేసరికి "గోరింకా ఎప్పుడూ గోడ దూకి వెళ్ళిపోయింది. ఈ చిలకకు ఒక్కటే గోరింకా..కానీ ఆ గోరింకకు మాత్రం ఊరంతా చిలకలే" అంటూ ఇండైరెక్ట్ గా సుడిగాలి సుధీర్ రష్మీని వదిలేసి మిగతా అమ్మాయిలతో మూవీస్ చేస్తున్నాడంటూ కామెంట్ చేసాడు భాస్కర్.

తర్వాత ఖుష్బూ చూపిస్తూ "మానవా అక్కడున్న మహారాణి ఎవరూ" అని సత్య ఆశ్చర్యంగా భాస్కర్ ని అడిగేసరికి "ఆవిడ ఖుష్బూ మహారాణి" అని భాస్కర్ చెప్పాడు.  "అవునా ఐతే ఆవిడకి ఆ పేరెలా వచ్చింది" అని అడిగింది సత్య. "ఖుషీ సినిమా రోజున ఆమె పుట్టిందట. హాస్పిటల్లో ఆమె పుట్టేసరికి ఖుషీ ఐపోయిన వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి భూ అన్నాడట.. అప్పుడు ఆమె ఈ అని నవ్విందట..అప్పుడు వాళ్ళ నాన్న ఖుష్బూ" అని పెట్టారట అని చెప్పాడు భాస్కర్. ఇక భాస్కర్, సత్య భైరవ ద్వీపం మూవీలో రోజాని మాంత్రికుడు ఎత్తుకుపోయే సీన్ ని స్పూఫ్ గా చేశారు. మాంత్రికుడు సత్యని తీసుకుపోడానికి వచ్చినప్పుడు పుష్పక విమానం ఎక్కడ అని సత్య అడగడం అంత బడ్జెట్ లేదు బయట షేర్ ఆటో ఉంది అందులో వెళదాం అని చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. యువరాణిని అప్పగించాలంటే తాను వేసుకున్న మాంత్రికుడు డ్రెస్ ఇవ్వను అని మాంత్రికుడు చెప్పేసరికి ...టైం దాటితే కాస్ట్యూమర్ వచ్చి డ్రెస్ అడుగుతాడు నువ్వు అద్దె కడతావా అంటూ ఫైర్ అయ్యాడు భాస్కర్. ఇలా హిలేరియస్ గా ఉంది ఈ స్కిట్.