English | Telugu

కృష్ణ ముకుంద మురారి, మల్లి సీరియల్స్ ల మహా సంగమంలో మరో ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌- 209 లో.. అరవింద్, మల్లి కలిసి భోనం చెల్లిస్తారు. ఆ తర్వాత నువ్వు బెదిరించావ్ కాబట్టే అరవింద్ బాబు గారితో కలిసి భోనం చెల్లించాను కానీ మాలిని అక్కే బాబు గారి భార్య అని మల్లి చెప్పేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు మురారి ఫోన్ లో మాట్లాడుతుంటాడు.

మాలిని, మల్లిని చూస్తుంది. మళ్ళీ ఎందుకొచ్చావని మాలిని అడుగుతుంది. మిగిలినవాళ్ళంతా ఎలా మాట్లాడినా నేను పట్టించుకోను కానీ నేను ఇంత త్యాగం చేసిన నువ్వు నమ్మట్లేదు చూడు అదే బాధ అవుతుందని మల్లి అనగానే‌‌.. త్యాగం అనేది నీ మాటల్లో కనిపిస్తుంది కానీ చేతల్లో కన్పించట్లేదని అంటుంది. అరవింద్ ని నువ్వు చేసే కంపెనీ నుండి జాబ్ మానిపించేలా చేయు, అలాగైనా మీరిద్దరూ రోజు కలవకుండా ఉంటారని మాలిని అనగా.. "అంత చనువు నాకు ఎక్కడుంది‌. అతని జీవితం నుండి తప్పుకున్నాను" అని మల్లి అంటుంది. మరొకవైపు ముకుందకి గీతిక కాల్ చేస్తుంది‌. కాసేపు మాట్లాడుతుంది. అయితే కృష్ణ తన చీరకొంగులో కట్టిన ముడుపిని పెద్దమ్మకి సమర్పించి.. నా జీవితాంతం ఏసీపీ సర్ తో కలిసి ఉండేలా చేయమని కోరుకుంటుంది. అయితే కృష్ణ చీరకొంగు నుండి ఆ లెటర్ ని మెల్లిగా తనకి తెలియకుండా తీసుకుంటుంది‌ ముకుంద. దూరంగా వెళ్ళి ఆ లెటర్ చదువుతుంది. ఆ తర్వాత పోలీస్ జీప్ లో కానిస్టేబుల్స్ వస్తారు. క్రిమనల్ ని అరెస్ట్ చేయాలని మురారి వాళ్ళతో చెప్తాడు.

మురారి, గౌతమ్ ఇద్దరు కలుసుకుంటారు. గౌతమ్ తన ప్రేమకథ ముగిసిందని చెప్పగా.. నా ప్రేమకథ కూడా పెళ్ళి ముందు ముగిసింది కానీ అసలు ప్రేమ కథ పెళ్ళి తర్వాతే‌ మొదలైందని గౌతమ్ తో మురారి చెప్తాడు. ఆ తర్వాత అరవింద్ ని వెతికి చెప్తానని గౌతమ్ వెళ్తాడు. మరొకవైపు ముకుంద పడేసిన ఉత్తరం మల్లికి దొరుకుతుంది. అయితే మల్లి చేతిలో ఉత్తరం చూసిన మాలిని.. ఆ ఉత్తరం తీసుకొని చదువుతుంది. అరవింద్ కోసం మల్లి ఉత్తరం రాసిందేమోనని మాలిని అనుకుంటుంది‌. మరి మురారి కోసం కృష్ణ రాసిన ఆ ఉత్తరం తనకి చేరిందా? అరవింద్ కోసం మల్లి ఆ ఉత్తరం రాయలేదనే నిజం తెలిసిందా? లేదా తెలియాలంటే 'కృష్ణ ముకుంద మురారి', 'మల్లి' సీరియల్స్ ల మహా సంగమం తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.