English | Telugu

లండన్ లో తెలంగాణ కుర్రాడు అనిల్ జీల.. జాగ్రత్తలు చెప్తున్న నెటిజన్లు!

అనిల్ జీల.. హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.

యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి. రీసెంట్ గా దుబాయ్ లో ఓ ఈవెంట్ కి అనిల్ జీల వెళ్ళగా.. అక్కడి తెలుగువారంతా వచ్చారు. ఇప్పుడు మరో ఈవెంట్ కోసం అమెరికాకి బయల్దేరి వెళ్ళాడు అనిల్ జీల. అయితే లండన్ కి వెళ్ళాక ఎయిర్ పోర్ట్ లోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని అనిల్ జీల తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో స్పెషల్ గా మెన్షన్ చేశాడు.

అనిల్ జీల‌‌ వెళ్ళవలసిన విమానం ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోయిందని ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నానంటు చెప్పుకొచ్చాడు. ఇక తను అక్కడ ఉన్నాడని తెలిసి లండన్ లో లోకల్ గా ఉండే తెలుగు కుర్రాడు సంతోష్ అక్కడికి వచ్చాడని చూపించాడు. ఇక మరో నెటిజన్ జాగ్రత్తగా ఉండమని మెసెజ్ చేశాడంట. " అనిల్ బ్రో.. ఒక సెజెషన్.. గల్లీ నుండి ఢిల్లీ.. ఢిల్లీ టూ లండన్.. ఇలా అన్నీ చిన్నవయసులోనే చూశావ్.. బట్ పర్సనల్ లైఫ్ ని అవైడ్ చేయకు.. పైసా ఇవ్వాల ఉంటది రేపు పోతది. భార్య, బాబుని గుర్తుంచుకో.. అసలే రంగుల ప్రపంచం.. బీ అలెర్ట్. తొక్కేవాళ్ళు ఉంటారు‌. చూసుకో " అని ఓ నెటిజన్ తనకి మెసెజ్ చేశాడు. ఇలా చాలామంది అనిల్ జీలకి పర్సనల్ గా మెసెజ్ లు పంపిస్తున్నారని అతను చెప్పుకొచ్చాడు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.