English | Telugu

బాగుపడంట్రా అంటే ప్రేమలో పడతారేంటి : సుప్రిత

టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే సుప్రిత సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌.

తల్లి సురేఖతో తరచూ రీల్స్‌, డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్‌ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలర్స్‌ నుంచి ట్రోల్స్‌ కూడా ఎదుర్కునేది. అయినా తగ్గేదేలే అంటూ తన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్‌ చేస్తూనే ఉంటుంది.

సుప్రితకి ఇన్ స్టాగ్రామ్ లో 859K ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్ స్టాగ్రామ్ లో కుర్రాళ్ళని ఉద్దేశించి ఓ కామెంట్ చేసింది సుప్రిత. " జస్ట్ ఇప్పుడే నిన్ను కోరి మూవీ చూశాను.‌ అందులో ఓ‌ డైలాగ్ ఉంటుంది. బాగుపడండ్రా అంటే ప్రేమలో పడతారేంట్రా అని ఉంటుంది. ప్రేమలో పడకండి.. బాగుపడండి " అంటూ సుప్రిత ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం సుప్రిత హాట్ ఫోటోలు‌ నెట్టింట వైరల్ అయ్యాయి.‌ మాములుగానే కుర్రాళ్ళంతా సుప్రిత ఫోటోలకి తెగ కామెంట్లు చేస్తారు. తాజాగా వారిని ఉద్దేశించి ఇలా చెప్పడంతో ఇంకెంతమంది రియాక్ట్ అవుతారో చూడాలి మరి. సుప్రిత తెలుగులో ఈ సినిమా చేస్తోంది. అది త్వరలో రిలీజ్ అవుతుందని గతంలోనే చెప్పింది సుప్రిత.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.