English | Telugu
Brahmamudi : అప్పు మాస్ వార్నింగ్.. రాజ్ ఆ పని చేయగలడా!
Updated : Aug 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -499 లో...అప్పు, కళ్యాణ్ లని ధాన్యలక్ష్మి అవమానించిన విషయం రాజ్ గుర్తు చేసుకొని బాధపడతాడు.ఇంటికి తీసుకొని రావాలని ఆలోచించాను కానీ వచ్చాక వాళ్ళకి అవమానం జరగకుండా ఆపలేకపోయానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు అటోలో రూమ్ కి వస్తారు. ఆటో దిగుతుంటే ఒకతను కళ్యాణ్ పక్కనుండే బైక్ స్పీడ్ గా వెళ్తుండడంతో అప్పు అతనిపై కోప్పడుతుంది. అతను కూడా అప్పుపై కోప్పడగా.. అప్పు మరింత కోపంగా అతన్ని కొడుతుంది. దాంతో అతను సారి అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఇక్కడ ఇలా చేస్తున్నావ్ ఇంట్లో అంత అవమానిస్తుంటే సైలెంట్ గా ఉన్నావని కళ్యాణ్ అడుగగా.. నీకు మాట ఇచ్చాను కదా నిన్ను బాధపెట్టలేనని అప్పు అంటుంది. ఇంట్లో మా అమ్మ చేసిన దానికి నేను సారీ చెప్తున్నానని కళ్యాణ్ అనగానే అదంతా ఎప్పుడో మర్చిపోయిన అని అప్పు అంటుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేసి.. నేను రప్పించి మిమ్మల్ని బాధపడేలా చేసాను సారీ అని చెప్తాడు. నేను ఏదో ఒకటి సాధించి ఆ ఇంటికి తిరిగి వస్తానని రాజ్ తో కళ్యాణ్ చెప్తాడు.ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. మా తమ్ముడిని తీసుకొని వచ్చి ఇక్కడే ఉండేలా చేస్తానని రాజ్ ముందు కావ్యతో అన్న మాటలు గుర్తు చేసుకొని.. నీకు మంచి స్టఫ్ దొరికింది కదా అని రాజ్ అంటాడు. ఇక ఇద్దరి మధ్యలో ఎప్పటిలాగే గొడవ జరుగుతుంది. మరొకవైపు ఆ ధాన్యలక్ష్మి నా మాటలు విని కన్నకొడుకుని దూరం చేసుకుంది. ఇక ఎప్పటికి ఈ ఇంటికి రాకుండా చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్రాణి, రాహుల్ లు డ్రింక్ చేస్తుంటారు. వాళ్ళని స్వప్న చూసి నా చెల్లిని రాకుండా చేసి ఇద్దరు పార్టీ చేసుకుంటారా.. మీ సంగతి చెప్తానని స్వప్న అనుకుంటుంది.
మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి అపర్ణ వచ్చి.. నీ కన్నకొడుకుని దూరం చేసుకున్నానని భాదపడుతున్నావా లేక పంతం నెగ్గించుకున్నానని గర్వపడుతున్నావా అని అపర్ణ అడుగుతుంది. నేను ఎప్పుడు ఆ అప్పుని నా కోడలుగా ఒప్పుకోలేనని ధాన్యలక్ష్మి చెప్పగానే అపర్ణ వెళ్ళిపోతుంది. కావ్యని కోడలు చేసుకొని నష్టపోయింది.. ఇప్పుడు నేను అలా నష్టపోవాలనుకుంటుందని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత రుద్రాణి గదిలో బెలూన్ లు పెడుతుంది స్వప్న. అందులో లాఫింగ్ లిక్విడ్ వేసి పెడుతుంది. ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ లు గదిలో కి వచ్చి ఆ బెలూన్ లు ఏంటని అనుకుంటారు. హ్యాపీ బర్త్డే మమ్మీ అని రాహుల్ ఒక బెలూన్ పగులగోడతాడు. దాంతో ఇద్దరు నవ్వుతూనే ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.