English | Telugu
'యూ నాటీ.. ఏయ్ ఆంటీ'.. సుమపై బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్!
Updated : Sep 21, 2022
సుమ ఎంత కామెడీ చేస్తుందో బ్రహ్మాజీ కూడా అంతే కామెడీ చేస్తుంటాడు. బ్రహ్మజీ ఏజ్ అనేది ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎంత వయసొచ్చినా అలాగే ఉంటాడు అంటారు ఆడియన్స్ కూడా. ఇటీవల బ్రహ్మాజీని అంకుల్ అంటూ ట్విట్టర్ లో నెటిజన్స్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు 'కృష్ణ వ్రింద విహారి` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుమ, బ్రహ్మాజీ కామెడీ సూపర్ అని చెప్పొచ్చు. సుమ బ్రహ్మజీ పక్కకు వచ్చి కూర్చుని "హమ్మయ్య ఇక్కడ హాయిగా, రిలాక్స్ గా అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి బ్రహ్మాజీ గారు మీ మనోభావాలు ఏమైనా దెబ్బ తిన్నాయా?" అని అడిగింది సుమ.
"దేనికి?" అని ఆయన అనేసరికి "లేట్ గా పిలిచాను కదా..అందుకు" అంది సుమ. దానికి బ్రహ్మాజీ "కొంచెం ఆకలేస్తోంది, షూటింగ్ నుంచి వచ్చాం, మళ్ళీ మార్నింగ్ షూటింగ్ ఉంది"అని చెప్పాడు. "మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి" అని సుమ అనేసరికి, "మీరు ఏమీ అడగరా?" అని బ్రహ్మాజీ రివర్స్ లో ప్రశ్నించాడు.. దానికి సుమ "మీ ఆస్తి వివరాలు చెప్పండి" అనేసరికి "రాజీవ్ కనకాల కంటే ఎక్కువే" అంటాడు.
సెకండ్ క్వశ్చన్ "మీ ఏజ్ ఎంత?" అని అడిగేసరికి "యూ నాటీ.. ఏయ్ ఆంటీ" అంటూ కామెంట్స్ చేసి షాకిచ్చాడు. దాంతో సుమ ఏమీ మాట్లాడలేక "ఏమిటో ఎటు వెళ్తుందో.. నో కామెంట్స్..రేపు మీకు ఎవరితో షూటింగో ఏమిటో చూసుకోండి" అంది సుమ. ఇటీవల అనసూయను సోషల్ మీడియాలో ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం, వాళ్ళ మీద కేసులు పెట్టిన విషయం తెలిసిందే.