English | Telugu

లాస్య‌కు ‘బేబీ ఇన్ ప్రోగ్రెస్-2’.. విషెస్ చెప్తున్న ఫాన్స్!

యాంకర్ లాస్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏనుగు చీమ జోక్స్ చెప్పడంలో పెట్టింది పేరు లాస్య. తన కెరీర్ స్టార్టింగ్ లో రవి, లాస్య యాంకరింగ్ జోడి చాలా బాగుండేది. లాస్య యాంకరింగ్ చేస్తూ, అప్పుడప్పుడు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ తన భర్త మంజునాథ్ ని కూడా షోస్ కి తీసుకొస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కొంచెం ఆక్టివ్ గానే ఉంటుంది లాస్య. ఇక ఇప్పుడు లాస్య రెండో సారి తల్లికాబోతున్నట్టు చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు లాస్య, మంజునాథ్ దంపతులు . ప్రెగ్నెన్సీ కిట్ ని, మెడికల్ రిపోర్ట్ ని చూపిస్తూ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాస్యకి ముందు జున్ను అనే బాబు ఉన్నాడు. లాస్య తల్లి అవుతున్న సందర్భంగా ఫాన్స్, రిలేటివ్స్, బుల్లితెర నటులు అంతా విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ గా ఫేమస్ అయిన లాస్య బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. లాస్య, మంజునాథ్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల లాస్య చాలా హై ఫీవర్ తో హాస్పిటల్ లో చేరి తిరిగి కోలుకుని ఇప్పుడు ఇలా గుడ్ న్యూస్ చెప్పింది.