English | Telugu

'కంటెస్టెంట్స్ అందరూ న‌న్ను నెగ‌టివ్‌గా చూస్తున్నారు'.. ఏడ్చేసిన రేవంత్!



పదహారవ రోజు బిగ్ బాస్ 'దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే' పాటతో మొదలైంది.

"నీ వాయిస్ అస్సలు వినిపించడం లేదు" అని రాజ్ తో శ్రీసత్య చెప్పింది. "హౌజ్ లో ఉన్న పదిమందిని నువ్వు ఆక్సెప్ట్ చేయకపోతే రేపు లక్ష మంది ప్రేక్షకులను ఎలా ఆక్సెప్ట్ చేస్తావ్" అని ఆరోహి గురించి‌ చంటి, రాజ్ తో చర్చించాడు. తర్వాత "రేవంత్ ఎందుకు ఏడుస్తున్నావ్" అని సూర్య అడిగాడు. "నా తప్పు లేదు. అయినా సరే నేహాతో నేనే వెళ్ళి మాట్లాడాను. అది పట్టించుకోకుండా నేనేదో తప్పు చేసానని, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదని, నాకు సంస్కారం లేదని చెప్పింది. ఆ విషయాలకి తను నన్ను నామినేట్ చేసింది. ఇలా పదిమంది ముందు మట్లాడితే అందరూ నన్ను నెగెటివ్ గా అర్థం చేసుకుంటారు కదా" అని రేవంత్, సూర్యతో చెప్పుకుంటూ ఏడ్చేసాడు. తర్వాత "అడవిలో ఆట" అనే టాస్క్ ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు. "ఈ టాస్క్ లో పోలీసులుగా 'శ్రీసత్య, అది రెడ్డి, ఆదిత్య, ఫైమా, మెరీనా-రోహిత్, ఇనయా, రాజ్' ఉంటారు. దొంగలుగా 'ఆరోహీ, రేవంత్, సుదీపా, నేహా,‌ శ్రీహాన్, వాసంతి, అర్జున్, కీర్తిభట్, సూర్య' ఉంటారు. అత్యాశ వ్యాపారిగా గీతూ ఉంటుంది" అని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో చెప్పాడు. తర్వాత కాసేపు గడిచాక "ఈ రోజు టాస్క్ ఇప్పటితో ముగిసింది. మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుల భాద్యత మీదే" అని బిగ్ బాస్ చెప్పాడు.

శ్రీహాన్, నేహా, చంటి, గీతూ, ఆదిత్య, వాసంతి, ఇనయా, ఆరోహీ, రేవంత్
ఈ వారం నామినేషన్లో ఉన్నారు.