English | Telugu

Brahmamudi : పోలీసులకి ఫోటో పంపించిన రాజ్.. వాళ్ళిద్దరి గదిలో దొంగ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -258 లో.... కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తుందని తెలిసిన కనకం బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే కృష్ణమూర్తి వస్తాడు. కృష్ణమూర్తికి నిజం చెప్పాలని కనకం అనుకొని చెప్తుంది. మనకి ఒక సమస్య వచ్చిందని అనగానే.. ఏమైందని కృష్ణమూర్తి కంగారుపడుతాడు.

మన అప్పు ఆడపిల్ల.. దానికి క మనసు ఉంటుందని గుర్తుకు చేసిందని కనకం అనగానే.. అది మంచి విషయమే కాదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ మనసులో ఒక మనిషిని కోరుకుంటుంది. అది కళ్యాణ్ అని కనకం అనగానే.. కృష్ణమూర్తి షాక్ అవుతాడు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లని ఎరగా వేసి ఈ ఇంటికి కోడళ్ళని చేశారని నింద మన మీద పడింది. కావ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిన బలవంతంగా చేసాం. ఇప్పుడు అప్పు నాకు అతను ఇష్టమని చెప్పినా పెళ్లి చెయ్యని అసమర్థుడుని అని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ఇందిరాదేవి వచ్చి అరుణ్ ఫోటోని చూపిస్తూ.. ఇతను ఎవరు మన ఇంటికి స్వప్నతో కలిసి ఉన్న ఫొటోస్ కొరియర్ చేశారు. అవి ఎవరైనా చూస్తే బాగోదని చింపేసాను. ఈ ఫోటో స్వప్నకి చూపించి ఎవరని అడిగితే తెలియదని చెప్పింది. ఎవరు? ఏంటి తెలియకుండా అపార్ధం చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఇతను ఎవరో ఎందుకు ఫొటోస్ పంపించాడో కనుక్కోమని రాజ్ కి ఇందిరాదేవి చెప్తుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. ఈ ఫోటోలో ఉన్న అతను ఎవరో తెలుసా అని అడుగుతాడు. అరుణ్ మా అక్క కాలేజీ ఫ్రెండ్ అని కావ్య చెప్తుంది. ఎందుకు అడుగుతున్నారని కావ్య అనగానే రాజ్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అక్క నా దగ్గర ఏమైనా దాస్తుందా అని కావ్య అనుకుంటుంది. మరొక వైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు నీతో ఇక ఎక్కడికి రాదని కృష్ణమూర్తి కోపంగా అంటాడు. కళ్యాణ్ ఫీల్ అవుతాడని కనకం భావించి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. మరొక వైపు స్వప్న దగ్గరికి కావ్య వచ్చి రాజ్ కి నీపై డౌట్ వచ్చింది. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని కావ్య అడుగుతుంది. తప్పు చేసినప్పుడే ఎవరికి బయపడలేదు ఇంకా తప్పు చెయ్యకపోతే ఎందుకు బయపడుతానని స్వప్న అంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది స్టేజ్ 2 స్టార్ట్ చెయ్యాలని అనుకుంటాడు. అరుణ్ కి ఫోన్ చేస్తాడు రాహుల్. " స్వప్నకి ఫోన్ చేసి డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చెయ్" అని అరుణ్ తో రాహుల్ చెప్తాడు.

మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తు.. స్వప్న గురించి ఆలోచిస్తుంటాడు. స్వప్న నిజంగా ఏదైనా తప్పు చేస్తుందా? లేక నేనే ఎక్కవ ఆలోచిస్తున్నానా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఎస్ఐ కి రాజ్ ఫోన్ చేసి ఫోటో పంపిస్తున్నాను. అతని గురించి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్తాడు. ఆ తరువాయి భాగంలో రాజ్ కావ్యల గదిలోకి దొంగ వచ్చి.. వాళ్ళిద్దరి చేతులు, కాళ్ళు కట్టివేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.