English | Telugu

Guppedantha Manasu: దేవాయని కుట్ర అనుపమకి తెలియనుందా? 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -925 లో.. దేవయాని కుట్రలో భాగంగా అనుపమని తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఆ తర్వాత అనుపమకి మహేంద్ర, వసుధార, రిషిలపై నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా మాట్లాడుతుంది. ఎప్పుడు వసుధార, జగతిలకి ఎండీ చైర్ గురించి ఆర్గుమెంట్ జరిగేది. అందరి కన్ను ఎండీ చైర్ పైనే అని శైలేంద్ర అనగానే.. మరి నీకు ఎప్పుడు ఎండీ చైర్ గురించి ఆలోచన రాలేదా అని అనుపమ అడుగుతుంది. నాకు అలాంటి కోరికలేం లేవని శైలేంద్ర అంటాడు.

ఆ తర్వాత ఆ వసుధార మాములుది కాదు. స్టూడెంట్ గా కాలేజీలో జాయిన్ అయ్యి రిషిని ప్రేమిస్తున్నానని తన చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఎండీ అయిందని దేవయాని చెప్తుంది. మహేంద్ర, జగతిలకి చాలా రోజులు దూరంగా ఉన్నాడు. ఇంకా రిషి అయితే చిన్నప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోయిందన్న కోపంతో తనని అమ్మ అని కూడా పిలిచే వాడు కాదు.. మేడమ్ మేడమ్ అనేవాడని వసుధార, రిషిల గురించి నెగెటివ్ గా, తమ గురించి పాజిటివ్ గా చెప్తుంది దేవయాని. ఆ తర్వాత అనుపమ వెళ్ళిపోతుంది. నువ్వు అనుపమ వెనకాల వెళ్ళు. నా ఊహ కరెక్ట్ అయితే మహేంద్ర దగ్గరికి వెళ్లి నేను చెప్పిన వాటి గురించి అడుగుతుందని శైలేంద్రతో దేవయాని చెప్తుంది.

మరొక వైపు రిషి ప్యూన్ దగ్గర నుండి ఫైల్స్ తీసుకొని వసుధార క్యాబిన్ కి వెళ్లి ఆటపట్టిస్తాడు. సర్ మీరు ఎందుకు ఫైల్స్ తెచ్చారని వసుధార అడుగుతుంది.. ఆ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ.. ఫైల్స్ చెక్ చేస్తుంటారు. కాసేపటికి వర్క్ పూర్తి చేసుకొని వస్తాను. మీరు వెళ్ళండని రిషిని పంపిస్తుంది వసుధార. మరొకవైపు వసుధారకి ధరణి ఫోన్ చేసి.. ఇందాక ఇక్కడికి అనుపమ అని జగతి అత్తయ్య ఫ్రెండ్ వచ్చిందని ధరణి చెప్తుంది. ఎందుకు వచ్చిందని వసుధార అడుగుతుంది. ఏం తెలియదు చాలా సేపు ఆవిడతో అత్తయ్య మాట్లాడారని ధరణి చెప్తుంది. ఇప్పుడే ఇక్కడ నుండి అనుపమ వెళ్లిపోయిందని ధరణి చెప్తుంది.

ఆ తర్వాత వసుధార వెంటనే రిషికి ఫోన్ చేసి.. నేను వస్తున్నా ఆగండి అని చెప్పగానే రిషి కార్ దగ్గర వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు ఇంటికి బయలుదేర్తారు. మరొకవైపు మహేంద్ర దగ్గరికి అనుపమ వచ్చి.. ఎప్పటిలాగా మళ్ళీ మళ్ళీ జగతి గురించి అడుగుతుంది. నువ్వు జగతి దూరంగా ఉన్నారంట? అసలు రిషి కూడా జగతిని దగ్గరికి తియ్యలేదు అంట అని అనుపమ అనగానే.. అసలు ఇదంతా నీకు ఎవరు చెప్పారు? ఎక్కడ నుండి వస్తున్నావని అనుపమపై మహేంద్ర ఆరుస్తాడు. మరొక వైపు శైలేంద్ర అనుపమని ఫాలో అయి చాటుగా అనుపమ మహేంద్ర మాటలు వింటాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు ఇంటికి వస్తారు. అనుపమ ఇంట్లో ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.